గవర్నర్‌ను కలువనున్న ఏపీ సీఎం జగన్

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ను సీఎం జగన్ కలవనున్నారు. 2019, నవంబర్ 18వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12.30గంటలకు ఈ సమావేశం జరుగనుంది. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల క్రమంలో గవర్నర్‌ను జగన్ కలుస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు గవర్నర్‌ను కలిసి వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఏపీ పొలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ప్రధానంగా ఇసుక కొరతపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
రాష్ట్ర గవర్నర్ హరిచందన్‌ను వివిధ పార్టీల నేతల కలిసి ఇసుక దోపిడి, తదితర వివరాలపై వైసీపీ ప్రభుత్వంపై కంప్లయింట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇసుక కొరత సమస్యకు వైసీపీ నేతలు, మంత్రులే కారణమంటోంది టీడీపీ. భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావం తెల్పడం కోసం బాబు ఏకంగా ఇసుక పేరిట దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, తదితర అంశాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్..గవర్నర్‌ను కలిసి ఓ వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా..స్పందన లేదని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు జనసేనానీ.
ఇదిలా కొనసాగుతుండగానే గవర్నర్‌ను సీఎం జగన్ కలువనున్నారు. ఇసుక కొరత, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, తదితర వివరాలను ఆయన గవర్నర్‌కు వివరించే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది. గవర్నర్‌తో భేటీ అనంతరం ఇతర వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Read More : హైకోర్టు కోసమేనా : కర్నూలులో రాజధాని కమిటీ..భూములు సేకరించాలని సూచన