HBD YSJagan: ఏపీ సీఎం జగన్‌కు బర్త్‌డే శుభాకాంక్షల వెల్లువ.. ప్రధాని మోదీ సహా ప్రముఖుల విషెస్

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలోని ప్రతీ పల్లె, మండల, పట్టణ కేంద్రాలు జగన్ జన్మదిన వేడుకలతో సందడిగా మారాయి. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, ప్రముఖులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

HBD YSJagan: ఏపీ సీఎం జగన్‌కు బర్త్‌డే శుభాకాంక్షల వెల్లువ.. ప్రధాని మోదీ సహా ప్రముఖుల విషెస్

ys jagan

Updated On : December 21, 2022 / 12:18 PM IST

HBD YSJagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 50వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న జగన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, తమిళనాడు సీఎం స్టాలిన్, పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఏపీ వ్యాప్తంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు జన్మదిన కేక్ లు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రతీ పల్లె జగన్ పుట్టిన రోజు వేడుకలతో సందడిగా మారింది. మండల, పట్టణ కేంద్రాల్లో సేవా కార్యక్రమాల్లో వైసీపీ నేతలు నిమగ్నమయ్యారు. రక్తదాన శిబిరాలు, వృద్ధులకు, రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమాలు, ఇతర సహాయసహకారాలు అందిస్తూ జగన్మోహన్ రెడ్డి బర్త్ వేడుకలను వైసీపీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నారు.

ట్విటర్ లో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ లో వైఎస్ జగన్ బర్త్‌డే ఉంది. #HBDYSJagan అనే హ్యాష్ ట్యాగ్ తో అభిమానులు, దేశ, విదేశాల నుంచి వైసీపీ అభిమానులు, పార్టీ నాయకులు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల ట్వీట్లు దాటాయి.