Y.S.Jagan Mohan Reddy : ఈనెల 28న విదేశాలకు వెళ్లనున్న ఏపీ సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 28న వ్యక్తిగత పనుల నిమిత్తం పారిస్   పర్యటనకు  వెళుతున్నారు.

Y.S.Jagan Mohan Reddy : ఈనెల 28న విదేశాలకు వెళ్లనున్న ఏపీ సీఎం జగన్

Y.S.Jagan Mohan Reddy

Updated On : June 17, 2022 / 7:06 AM IST

Y.S.Jagan Mohan Reddy :  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 28న వ్యక్తిగత పనుల నిమిత్తం పారిస్   పర్యటనకు  వెళుతున్నారు. ఆయన పెద్ద కుమార్తె హర్షరెడ్డి పారిస్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు.

పారిస్ లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న హర్షరెడ్డి జులై  2న కాన్వోకేషన్ తీసుకోనున్నారు. కుమార్తె కాన్వోకేషన్ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతారు. అనంతరం రాష్ట్రానికి తిరిగి  వస్తారు. మరోవైపు పారిస్ వెళ్లేందుకు అనుమతివ్వాలని సీఎం జగన్ సీబీఐ కోర్టును కోరారు.

దేశంవిడిచి వెళ్లరాదని సీబీఐ కోర్టు ఆదేశాలనుసడలించాలని… కుమార్తె  కళాశాల స్నాతకోత్సవానికి వెళ్లి వస్తానని ఆయన కోరారు. ఇందుకోసం జూన్ 28 నుంచి వారం రోజులు పాటు పారిస్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టును కోరారు.

Also Read : Sachivalayam Employees : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్