Andhra Pradesh Covid – 19 : 24 గంటల్లో 13 వేల 756 కేసులు, 104 మంది మృతి

Andhra Pradesh Covid - 19
COVID-19 Cases AP : ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా..24 గంటల 13 వేల 756 మందికి కరోనా సోకింది. 104 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో 14 మంది మృత్యువాత పడ్డారు. ఏపీలో ప్రస్తుతం 1,73,622 యాక్టివ్ కేసులు ఉండగా..మొత్తం మరణాలు 10, 738కి చేరుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 20 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో 2 వేల 301 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో 20 వేల 392 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.
జిల్లాల వారీగా మృతుల వివరాలు :
పశ్చిమ గోదావరి జిల్లాలో 20 మంది, చిత్తూరులో 13 మంది, విశాఖపట్టణంలో 10 మంది, అనంతపూర్ లో తొమ్మిది మంది, తూర్పు గోదావరి జిల్లాలో తొమ్మిది మంది, గుంటూరులో ఎనిమిది మంది, కృష్ణాలో ఎనిమిది మంది, కర్నూలులో ఏడుగురు, నెల్లూరులో ఆరుగురు, విజయనగరంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, వైఎస్ఆర్ కడపలో ఇద్దరు, ప్రకాశంలో ఒక్కరు చనిపోయారు. నేటి వరకు రాష్ట్రంలో 1,90,88,611 శాంపిల్స్ పరీక్షించినట్లు వెల్లడించింది.
జిల్లాల వారీగా కేసులు :
అనంతపురం 1224. చిత్తూరు 2155. ఈస్ట్ గోదావరి 2301. గుంటూరు 780. వైఎస్ఆర్ కడప 632. కృష్ణా 782. కర్నూలు 742. నెల్లూరు 865. ప్రకాశం 811. శ్రీకాకుళం 666. విశాఖపట్టణం 1004. విజయనగరం 397. వెస్ట్ గోదావరి 1397.
మొత్తం : 13,756.
Read More : Black Fungus : బ్లాక్ ఫంగస్ కు చవక ట్యాబ్లెట్..అభివృద్ధి చేసిన హైదరాబాద్ ఐఐటీ