AP Covid Cases Updates : ఏపీలో 8,368 పాజిటివ్.. 10వేలకు పైగా రికవరీ

AP Covid Cases Live Updates : ఏపీలో కరోనా వైరస్ కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. కొన్నిరోజులు వరుసగా పదివేలకు పైనే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. ఇప్పుడు పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులే ఎక్కువగా పెరిగాయి.. ఇప్పటివరకూ కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో కాస్త ఆందోళన వ్యక్తమైంది.. కానీ, కరోనా కేసులు తగ్గడంతో కాస్తంత ఉపశమననే చెప్పొచ్చు..
మునపటి కంటే రికవరీ కేసులు ఎక్కువగా పెరిగాయి. ఏపీలో రాష్ట్రంలో గత 24 గంటల్లో 58, 187 కరోనా శాంపిల్స్ పరీక్షించారు.. వీరిందరి శాంపిల్స్ పరీక్షించగా 8,368 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. ప్రతిరోజు పదివేలకు పైనే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చాయి.. ఏపీ ఆరోగ్య శాఖ ఈ రోజు (సోమవారం) హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
కోవిడ్ వల్ల మరణించినవారు ప్రకాశంలో 10 మంది, గుంటూరులో 9మంది, చిత్తూరులో 8 మంది, కడపలో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఏడుగురు, కృష్ణలో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, అనంతపూర్‌లో నలుగురు, కర్నూల్‌లో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, తూర్పుగోదావరిలో ముగ్గురు మరణించారు. గడిచిన 24 గంటల్లో 10,055 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు..
ఇప్పటివరకూ ఏపీలో 41,66,077 శాంపిల్స్ పరీక్షించారు. ఏపీలో 50,6493 కరోనా శాంపిల్స్ లో 50,3598 పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్ నుంచి నమోదు కాగా 2461 కరోనా పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాలకు చెందిన 434 మంది పాజిటివ్ కేసులు ఉన్నాయి.