Dharmana Krishnadas : వచ్చేసారి కూడా జగనే సీఎం, కాకపోతే నా ఆస్తి మొత్తం రాసిస్తా : డిప్యూటీ సీఎం
పందెం కాయాలని టీడీపీకి ధర్మాన సవాల్ విసిరారు. జగన్ కు ఎవరూ సాటి రారని ధర్మాన పేర్కొన్నారు. భవిష్యత్ లో కూడా జగన్ లాంటి నేత ఉండరని తేల్చి చెప్పారు.

Dharmana
Dharmana Krishnadas : ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను పొగడ్తలతో ముంచెత్తారు. వచ్చే ఎన్నికల్లోనూ జగనే మళ్లీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. రెండోసారి జగన్ సీఎం కాకపోతే తన ఆస్తి మొత్తం రాసిస్తానని.. పందానికి రెడీ అన్నారు.
పందెం కాయాలని టీడీపీకి ధర్మాన సవాల్ విసిరారు. జగన్ కు ఎవరూ సాటి రారని ధర్మాన పేర్కొన్నారు. భవిష్యత్ లో కూడా జగన్ లాంటి నేత ఉండరని తేల్చి చెప్పారు. అతనికి అతనే సాటి అని కామెంట్ చేశారు.
వచ్చేసారి కూడా జగన్ సీఎం అవుతారని కాకపోతే తన ఆస్తి మొత్తం రాసిస్తానని సవాల్ చేశారు. కావాలంటే పందెం కాస్తా..టీడీపీ నేతలు కూడా రావొచ్చని అన్నారు.