Pawan Kalyan : ఎంపీడీవోపై వైసీపీ నేతల దాడి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్, కీలక నిర్ణయం..

శుక్రవారం గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై మండల పరిషత్ కార్యాలయంలో దాడి చేశారు.

Pawan Kalyan : ఎంపీడీవోపై వైసీపీ నేతల దాడి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్, కీలక నిర్ణయం..

Updated On : December 28, 2024 / 12:02 AM IST

Pawan Kalyan : అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ దాడి ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. దాడి ఘటనను పవన్ కల్యాణ్ ఖండించారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఆఫీస్ లోకి చొరబడి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ దాడి అప్రజాస్వామిక చర్య అని, ఇలాంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు తావు లేదని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. శనివారం కడప రిమ్స్ కు వెళ్లనున్న పవన్ కల్యాణ్ బాధిత ఎంపీడీవోను పరామర్శించనున్నారు.

శుక్రవారం గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై మండల పరిషత్ కార్యాలయంలో వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు తీవ్రస్థాయిలో దాడి చేశారు. దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీరియస్ గా స్పందించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అటు జవహర్ బాబును పరామర్శించి ధైర్యం చెప్పాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించారు.

శనివారం పవన్ కల్యాణ్ కడప వెళ్లనున్నారు. దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును ఆయన పరామర్శించనున్నారు.

అన్నమయ్య జిల్లాలో ఎంపీడీవోపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. రాయచోటి నియోజకవర్గం గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబు, ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి మధ్య ఆఫీసు తాళాల విషయంలో వాగ్వాదం జరిగింది. మాట మాట పెరిగింది. ఇరువురి మధ్య ఘర్షణ జరిగి ఉద్రిక్తతలకు దారితీసింది. సుదర్శన్ రెడ్డితో పాటు అతడి అనుచరులు ఎంపీడీవోపై దాడి చేశారు. తీవ్ర గాయాలు కావడంతో ఎంపీడీవోను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఎంపీడీవో ఫిర్యాదుతో సుదర్శన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు.

 

Also Read : వైసీపీని వీడి బీజేపీలో చేరిన ఆడారి ఆనంద్.. జగన్ పార్టీకి మరో ఆయుధం దొరికినట్లేనా?