Pawan Kalyan : జగన్ ఏపీని అప్పుల కుప్పగా మార్చేశారు- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వెళ్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

Pawan Kalyan : జాతీయ మీడియాతో చిట్ చాట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి సమన్వయంతోనే కలిసి ముందుకు వెళ్తోందన్నారు. వెన్ను నొప్పి కారణంగా కొన్ని సమావేశాలకు తాను హాజరు కాలేదన్నారు. వెన్ను నొప్పి ఇప్పటికీ తనను బాధిస్తోందన్నారు పవన్ కల్యాణ్.
ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చారని, దీంతో రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వెళ్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన హామీలను, గ్యారెంటీలను అమలు చేస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్నారు. గత జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైందన్నారు. ఈ నేపథ్యంలోనే హామీల అమలుకు కొంత ఆటంకాలు ఎదురవుతున్నా.. వాటిని అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నామన్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన కొన్ని సమావేశాలకు తాను హాజరు కాలేదన్న అంశంపైనా పవన్ స్పందించారు.
తనను వెన్ను నొప్పి తీవ్రంగా బాధిస్తోందని, అందువల్లే సమావేశాలకు హాజరు కాలేకపోయాను అని వివరణ ఇచ్చారు. అంతేకానీ, కూటమిలో ఎటువంటి ఇబ్బందులు లేవని, సమన్వయంతో కలిసి ముందుకెళ్తున్నామని, ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా పని చేస్తున్నామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అటవీ పర్యావరణ శాఖలు తనకు చాలా ఇష్టమైన శాఖలని, నిబద్దతతో తన మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు పవన్ కల్యాణ్.
Also Read : ఆ కేసుల్లో నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మోదీ పవన్ కల్యాణ్ తో చాలా సన్నిహితంగా మాట్లాడారు. పవన్ కల్యాణ్ వేషధారణ చూసిన మోదీ.. మీరు హిమాలయాలకు వెళ్తున్నారా అని సరదాగా పవన్ ను అడిగారు ప్రధాని మోదీ. వేదికపై వచ్చే సమయంలో ఇరువురి మధ్య సంభాషణ జరిగింది.
పవన్ కల్యాణ్ ను ప్రధాని మోదీ పలకరించారు. ప్రత్యేక వస్త్రధారణలో ఉన్న పవన్ తో ప్రధాని మోదీ కాసేపు మాట్లాడారు. హిమాలయాలకు వెళ్తున్నారని అని ప్రధాని మోదీ అడగ్గా.. అలాంటిదేమీ లేదని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని తాను ప్రధానితో చెప్పానని మీడియాతో చిట్ చాట్ సందర్భంగా పవన్ కల్యాణ్ అన్నారు.