AP EAMCET Results 2026: రేపే ఏపీ ఎంసెట్ ఫలితాలు.. ఇక్కడ చెక్ చేసుకోండి.. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ ఇలా.. డైరెక్ట్ లింక్..
ఏపీ ఎంసెట్ పరీక్షలు మే 12 నుండి మే 20 మధ్య నిర్వహించారు. ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ రంగాలలో అండర్ గ్రాడ్యుయేట్ వృత్తి విద్యా కోర్సులలో ప్రవేశం కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు.
AP EAMCET Results 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (EAMCET-EAPCET) 2026 ఫలితాలు, మెరిట్ జాబితాను రేపు ( జూన్ 1, 2026న) విడుదల చేసే అవకాశం ఉంది. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు cets.apsche.ap.gov.inలో తమ ఫలితాలను చూసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష నిర్వహణ సంస్థ జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ), కాకినాడ ఫలితాలను విడుదల చేస్తుంది. రేపు ఉదయం సుమారు 11 గంటలకు ఫలితాలు, మెరిట్ జాబితా, ర్యాంక్ కార్డును విడుదల చేసే అవకాశం ఉంది.
ర్యాంక్ కార్డును ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి..
cets.apsche.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
హోమ్‌పేజీలో ‘డౌన్లోడ్ 2026 ఫలితాలు’ (Download 2026 results) పై క్లిక్ చేయండి.
మీ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేయండి.
మీ ర్యాంక్ కార్డు స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
భవిష్యత్ సూచన కోసం డౌన్లోడ్ చేసుకొని భద్రపరుచుకోండి.
AP EAMCET ర్యాంక్ కార్డులో పేర్కొన్న వివరాలు
అభ్యర్థి పేరు
తండ్రి/తల్లిదండ్రుల పేరు
లింగం
పుట్టిన తేదీ
కేటగిరీ/రిజర్వేషన్ వివరాలు (ఉదా OC, BC, SC, ST)
ప్రాంతం (స్థానిక ప్రాంతం, ఉదా AU, SVU, OU)
పరీక్ష & దరఖాస్తు వివరాలు
AP EAMCET/EAPCET హాల్ టికెట్ నంబర్
రిజిస్ట్రేషన్ నంబర్
దరఖాస్తు చేసిన స్ట్రీమ్ (ఇంజనీరింగ్ లేదా వ్యవసాయం & ఫార్మసీ)
స్కోర్లు & ర్యాంక్ వివరాలు
నార్మలైజ్డ్ మార్కులు (ప్రవేశ పరీక్షలో పొందిన స్కోరు)
విభాగాల వారీగా మార్కులు (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మరియు మ్యాథమెటిక్స్/బయాలజీ)
పొందిన మొత్తం మార్కులు
మొత్తం AP EAMCET ర్యాంక్
కేటగిరీ ర్యాంక్
అర్హత స్థితి (పాస్/ఫెయిల్)
ఏపీ ఎంసెట్ పరీక్షలు మే 12 నుండి మే 20 మధ్య నిర్వహించారు. ఏపీ ఈఏఎంసెట్ (ఇప్పుడు అధికారికంగా ఏపీ ఈఏపీసీఈటీగా పేరు మార్చబడింది) అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ రంగాలలో అండర్ గ్రాడ్యుయేట్ వృత్తి విద్యా కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే ఒక రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష.
Also Read: తల్లికి వందనం.. కీలక ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం.. డబ్బులు పడేది అప్పుడే..
