AP EAPCET 2025 : ఈరోజే ఎప్‌సెట్ నోటిఫికేషన్.. 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. బీటెక్ కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకేనా?

AP EAPCET 2025 : ఏపీ ఎప్‌సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. జేఎన్‌టీయూహెచ్ ఫిబ్రవరి 20న ఎప్‌సెట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ నెల 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉండనుంది. పూర్తి వివరాల ఇలా ఉన్నాయి.

AP EAPCET 2025 : ఈరోజే ఎప్‌సెట్ నోటిఫికేషన్.. 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. బీటెక్ కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకేనా?

EAPCET 2025

Updated On : February 20, 2025 / 12:04 PM IST

AP EAPCET 2025 : ఎప్పెడెప్పుడా అని విద్యార్థులు ఎదురుచూస్తున్న ఏపీ ఎప్‌‌సెట్‌ (EAPCET)కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈరోజు (EAPCET 2025) నోటిఫికేషన్ విడుదల కానుంది.
జేఎన్టీయూహెచ్ (JNTUH) ఫిబ్రవరి 20న ఎప్‌సెట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది.

దీనికి సంబంధించి పూర్తి సమాచారం మధ్యాహ్నం నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని కన్వీనర్ ఆచార్య బి. డీన్కుమార్ కో కన్వీనర్ కె. విజయ కుమార్రెడ్డి పేర్కొన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులను ఈ నెల 25 నుంచి స్వీకరించనున్నారు.

Read Also : Gold Rates Today : బంగారం తగ్గేదే లే… ఏపీ, తెలంగాణలో గోల్డ్ రేట్స్ ఇవే..

15 శాతం నాన్ లోకల్ కోటా ఎత్తివేస్తారా? :
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం(2025-26) కన్వీనర్ కోటాకు సంబంధించి ఉత్కంఠ నెలకొంది. బీటెక్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇప్పటివరకు ఉన్న 15 శాతం అన్‌‌రిజర్వుడ్ (నాన్ లోకల్) కోటా ఎత్తివేసే పరిస్థితి కనిపిస్తోంది.

ఇంజినీరింగ్ సీట్లను 70 శాతం కన్వీనర్ కోటా అందించగా, 30 శాతంతో బి.కేటగిరీ(మేనేజ్‌మెంట్) కింద భర్తీ చేయడం జరుగుతుంది. అయితే, కన్వీనర్ కోటాలోని సీట్లలో 85 శాతం వరకు తెలంగాణ స్థానికత విద్యార్థులకే కేటాయిస్తున్నారు. మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణ సహా ఏపీ విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లు అవుతుంది. స్థానికత, స్థానికేతర కోటా అంశాలకు సంబంధించి అధ్యయనంపై ప్రభుత్వం 2024 డిసెంబరులో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, ఇప్పుడు ఆ కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేసింది.

కన్వీనర్ కోటా సీట్లపై ఉత్కంఠ :
కన్వీనర్ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే కేటాయించాలని, 95 శాతం రాష్ట్ర విద్యార్థులకు, మిగిలిన 5 శాతం ఇతర రాష్ట్రాల్లో ఉండే తెలంగాణ స్థానికత విద్యార్థులకు ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

దీనికి సంబంధించి కమిటీ చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డిని వివరణ కోరినట్టు తెలిసింది. 95-5 కోటాపై ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. తుది నిర్ణయం ఇంకా వెల్లడి కాలేదు. కానీ, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ఇంజినీరింగ్ ప్రవేశాలు ఉంటాయనే నిబంధన విధించి ఎప్‌సెట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ కమిటీ సిఫారసును ప్రభుత్వం ఆమోదిస్తే మాత్రం రాష్ట్ర విద్యార్థులకు మరిన్ని ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం 15 శాతం అన్‌రిజర్వుడ్ కోటాలో మొత్తం 12 వేల సీట్లు ఉన్నాయి. 4 వేల నుంచి 5 వేల సీట్లు మెరిట్ ఆధారంగానే ఏపీ విద్యార్థులకు దక్కుతున్నాయి.

Read Also : iPhone 16e Launch : భలే ఉంది భయ్యా.. అత్యంత సరసమైన ఆపిల్ ఐఫోన్ 16e వచ్చేసిందోచ్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

విజయవాడ, కర్నూలులో పరీక్షా కేంద్రాలు :
ఏపీ సరిహద్దు ప్రాంతాల్లోని తెలంగాణ విద్యార్థులు తమకు దగ్గరలోనే పరీక్షలు రాసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ, కర్నూలులో పరీక్షా కేంద్రాలు ఉండనున్నాయి. గతంలో ఏపీలో రెండు సిటీలతో పాటు విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 25 లోపు ఏపీ విద్యార్థుల విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.