ఈసీ లేఖ నిజమే..రమేశ్ కుమార్‌కు భద్రత కల్పిస్తాం – కిషన్ రెడ్డి

ఏపీ రాష్ట్రంలో ఎన్నికల అధికారి రమేశ్ కుమార్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ఆయన రాసినట్లుగా ప్రచారమౌతున్న లేఖపై..భద్రత విషయంలో కేంద్రం స్పందించింది. ఆయనకు పూర్తి భద్రత కల్పిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రమేశ్ కుమార్ నుంచి కేంద్ర హోం శాఖకు లేఖ రావడం జరిగిందని, దీనిపై సీఎస్‌తో కేంద్ర హోం శాఖ కార్యదర్శి మాట్లాడడం జరిగిందన్నారు.
See Also | ఏపీ ఎన్నికల కమిషనర్ పేరిట కేంద్ర హోం శాఖకు లేఖ..ఎవరు రాసుంటారు
లేఖ ఆయన రాసినట్లుగానే తాము భావించడం జరుగుతోందన్నారు. అయితే..ఏ ప్రభుత్వ ఉద్యోగి విషయంలో విధి నిర్వాహణ ఉన్న సమయంలో భయపెట్టడం మంచిది కాదని సూచించారు. అధికారులను బెదిరిస్తుంటే..కేంద్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారాయన. ఈ విషయంలో తాము ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవడం జరుగుతోందని వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న రమేశ్ కుమార్‌కు భద్రత కేటాయించినట్లు, ఏపీకి వచ్చినట్లు అయితే..రక్షణ కల్పించాలని సీఎస్‌కు సూచించడం జరిగిందన్నారు. అవసరమైతే..లిఖితపూర్వకంగా రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
* తనకు ప్రాణహానీ ఉందని, తన కుటుంబానికి భద్రత కల్పించడి అంటూ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాయడం సంచలనం సృష్టించింది.
* లేఖను రాయలేదంటూ రమేశ్ కుమార్ కొట్టిపారేస్తున్నారు.
* ఒకవైపు తాను లేఖ రాయలేదంటూనే.. మరోవైపు విచారణకు మాత్రం ఆయన ఆదేశించడం లేదు.
* ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ పేరుతో విడుదలైన లేఖ టీడీపీ సృష్టేనని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కొట్టిపారేశారు.
* రమేశ్ కుమార్‌కు సీఆర్పీఎఫ్ భద్రత కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
Read More : కరీంనగర్‌లో హై అలర్ట్ : హైపోక్లోరిన్ స్ర్పే..ఇంటి నుంచి బయటకు రావొద్దు