AP Elections 2024 : తాడిపత్రిలో ఫ్యాక్షన్ సినిమాను తలపించిన సీన్లు .. పోలింగ్ బూత్‌ వద్ద ఎదురుపడ్డ పెద్దారెడ్డి, ప్రభాకర్ రెడ్డి

ఏపీలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతల నడుమ పోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సీన్లు ఫ్యాక్షన్ సినిమాను తలపించాయి.

AP Elections 2024 : తాడిపత్రిలో ఫ్యాక్షన్ సినిమాను తలపించిన సీన్లు ..  పోలింగ్ బూత్‌ వద్ద ఎదురుపడ్డ పెద్దారెడ్డి, ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy Vs Pedda Reddy

Updated On : May 13, 2024 / 2:26 PM IST

JC Prabhakar Reddy Vs Pedda Reddy : ఏపీలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతల నడుమ పోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సీన్లు ఫ్యాక్షన్ సినిమాను తలపించాయి. ఓకే పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిలు ఓటు వేయడానికి వచ్చారు. వారిద్దరు ఎదురు పడటంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉధ్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. నేతలిద్దరూ ఒకరిని చూస్తూ మరొకరు ఎదురెదురుగా నిలబడ్డారు. దీంతో ఏం జరుగుతుందోనని పోలీసులుసైతం హడలిపోయారు. ముందు ప్రభాకర్ రెడ్డినే పంపాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనగా.. లేదు ముందు పెద్దారెడ్డినే పంపాలని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి పట్టుబట్టాడు.

Also Read : వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ను చెంపదెబ్బ కొట్టిన ఓటరు.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ప్రభాకర్ రెడ్డి వర్గీయులు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోవడంతో ఫ్యాక్షన్ సినిమా తరహా వాతావరణం కనిపించింది. పోలీసులు ఇరువురు నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఇద్దరు నేతలు వెనక్కు తగ్గలేదు. అయితే పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం పట్టణంలోని ఓం శాంతి నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకున్నారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యారు. ఇరు వర్గాలకు సంబంధించిన వాహనాలు ద్వంసం అయ్యారు. సంఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, పోలీసులు చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు.

Also Read : పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత.. ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుపై రాళ్లదాడి