ఏపీలో జీబీఎస్ సిండ్రోమ్ భయం.. రోజుకు 5 ఇంజక్షన్లకు రూ.లక్ష.. లక్షణాలు ఇవే: సర్కారు ఫుల్‌ డీటెయిల్స్‌

మనిషి వెయిట్ ఉన్న దాన్ని బట్టి ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది.

ఏపీలో జీబీఎస్ సిండ్రోమ్ భయం.. రోజుకు 5 ఇంజక్షన్లకు రూ.లక్ష.. లక్షణాలు ఇవే: సర్కారు ఫుల్‌ డీటెయిల్స్‌

Updated On : February 17, 2025 / 5:52 PM IST

గులియన్‌-బారీ సిండ్రోమ్‌ (జీబీ సిండ్రోమ్‌)పై ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖమంత్రి సత్యకుమార్ యాదవ్ వివరాలు తెలిపారు. అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “గులియన్ బారీ సిండ్రోమ్ కేసులు పట్ల వైద్యరోగ్య శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంది.

స్పెషల్ ఛీప్ సెక్రటరీ ఎంటి కృష్ణబాబుతో కలసి సీఎం వద్ద సమీక్ష చేశాం. గత సంవత్సరం రాష్ట్రంలో 301 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు జీజీహెచ్ లో అత్యధిక కేసు నమోదు అయ్యాయి. అక్కడకు రిఫరెన్స్ లు ఎక్కువ ఉండడంతో అక్కడికి కేసులు ఎక్కువగా వస్తున్నాయి.

జీబీఎస్‌ బారిన పడిన వారికి సరపడా ఇమ్యూనోగోబిలిన్ ఇంజక్షన్ లు ఉన్నాయి. 85 శాతం మందికి చికిత్స లేకుండానే తగ్గిపోతుంది. ఈ వ్యాధికి సంభందించి చికిత్స అన్ని ప్రధాన ఆసుపత్రుల్లోనూ అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి రోజుకు 5 ఇంజక్షన్లకు లక్షరూపాయలు అవుతుంది. అయిదురోజులు పాటు ఈ ఇంజక్షన్ లు ఇవ్వాల్సి ఉంటుంది” అని అన్నారు.

ఇది మహమ్మారి కాదు.. అంటువ్యాధి కాదు..
స్పెషల్ ఛీప్ సెక్రటరీ కృష్ణబాబు మాట్లాడుతూ… “పూణె నుంచి ఈ కేసు మొదటి సారిగా వచ్చింది. జనరల్ గా వచ్చిన ఇన్పెక్షన్లు తగ్గాక యాంటీబాడీస్ తిరిగి బాడీపై పనిచేస్తాయి. ఇవి లక్షలో ఒకరికి వస్తాయి. సీఎం సర్వైవలెన్స్ కంటిన్యూ చేయాలని చెప్పారు. న్యూరోఫిజిషియన్స్, డిపార్టమెంట్లు స్ట్రాంగ్ గా ఉండే వాటి విషయంలో ప్రియార్టీ.

ఇమినో గ్లోబిన్స్ 1200 అందుబాటులో ఉండగా మరో 6000 త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ఈ కేసుల విషయంలో సింటమ్స్ ప్రతి ఒక్కరికి తెలియాలి. రెండు మూడు రోజుల్లో కాళ్లతోనడవ లేకపోవడం, బ్రిథింగ్, ఫుడ్ తినడం తగ్గుతుంది. గిద్దలూరులో కొందరు 3 రోజులు వైద్యం చేయించుకున్నారు.

ఆ తరువాతే జీజీహెచ్ కు వచ్చారు. 10 ఏళ్ల చిన్న పిల్లాడు కూడా ఆలస్యంగా వైద్యానికి వచ్చి, జీజీహెచ్ లో మెడికల్ ఎడ్వైజ్ కు వ్యతిరేకంగా బయటకు వెళ్లి పోయాడు. తరువాత శ్రీకాకుళంలో జెమ్ ఆసుపత్రిలో చేర్చారు. తరువాత చనిపోయాడు. వేలమందికి ఇన్ఫెక్షన్ వస్తే వారిలో ఎవరికి జీబీ సిండ్రోమ్ ఎవరికి వస్తుందో చెప్పలేము. చాలా సింపుల్ టెస్టులతోనే పరీక్ష చేయవచ్చు.

శ్రీకాకుళం, గిద్దలూరులలో హౌస్ టే హౌస్ సర్వే చేయిస్తున్నాం. సీఎం స్పష్టమయిన ఆదేశాలు ఇచ్చారు. ఎక్స్‌ట్రా బడ్జెట్ కావాలన్నా ఇస్తామన్నారు. ఇది మహమ్మారి కాదు, అంటువ్యాధి కాదు. రాష్ట్రంలో జీబీ సిండ్రోమ్ ఒకే చోట రావడం లేదు. పూణెలో 181 కేసులు ఒకే ఏరియా నుంచి వచ్చాయి.

దీనికి కారణం వాటర్ కంటామినేషన్ , పైల్ట్రీ కంటామినేషన్. గత రెండు మూడేళ్లలో అయినా కేవలం 250 నుంచి 300 కేసులు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు కూడా పరిమితిలోనే కేసులు నమోదవుతున్నాయి. మనిషి వెయిట్ ఉన్న దాన్ని బట్టి ఇంజక్షన్ లు ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చే మాన్ సూన్ నాటికి స్వచ్ఛమయిన నీరు వచ్చేలా చూస్తున్నాం. పౌల్ట్రీ వర్కర్ లు కు కూడా పరీక్షలు చేశాం. ఈ రోజుకు 17 మంది జీబీఎస్‌ ఉన్నవారు ఆసుపత్రిలో ఉన్నారు” అని చెప్పారు.