ఏపీలో 8మంది ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా, భయాందోళనలో ఉద్యోగులు

ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదివారం(ఏప్రిల్ 19,2020) ఒక్కరోజే కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు

  • Published By: veegamteam ,Published On : April 20, 2020 / 03:25 AM IST
ఏపీలో 8మంది ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా, భయాందోళనలో ఉద్యోగులు

Updated On : April 20, 2020 / 3:25 AM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదివారం(ఏప్రిల్ 19,2020) ఒక్కరోజే కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదివారం(ఏప్రిల్ 19,2020) ఒక్కరోజే కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో షాకింగ్ ఏంటంటే, వీరిలో 8మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం కలవరం రేపుతోంది. 8మంది ఉద్యోగుల్లో ఒకరు పోలీసు అధికారి. ఇద్దరు సచివాలయ ఉద్యోగులు. ఐదుగురు రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా రెడ్ జోన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. వీరికి ముందుగా ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. ఇక మరో ఇద్దరు మెడికల్‌ షాపుల యజమానులు కాగా, మరో వ్యక్తికి కరోనా సోకింది.

కరోనా బాధితుల కుటుంబాలను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. తాజాగా నమోదైన కేసులతో వారికి సంబంధించిన కాంటాక్ట్‌లను కూడా ట్రేస్ చేస్తున్నారు. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో.. ఇక శ్రీకాళహస్తిలో లాక్‌డౌన్‌ అమల్లో ఎలాంటి మినహాయింపులు లేవని జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేశారు.

ఏపీలో 647 కరోనా కేసులు:
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. రోజూ రెండెంకల సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటలుగా కొత్తగా 44 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 647కు చేరుకుంది. వీరిలో 65 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకూ కరోనాతో 17మంది మృతి చెందారు.

కర్నూలులో 158, గుంటూరులో 129:
కరోనా కేసులు అత్యధికంగా కర్నూలులో 158, గుంటూరులో 129, కృష్ణా 75, నెల్లూరు 67, ప్రకాశం 44, కడప 37, పశ్చిమ గోదావరి 35, అనంతపురం 29, చిత్తూరు 28, తూర్పుగోదావరి 24, విశాఖపట్నం 21 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో శనివారం ఒక్కరోజే 22 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో మొత్తం 72 కరోనా పాజిటివ్‌ కేసులకు గాను.. 59 విజయవాడలోనే ఉన్నాయి.

కాగా, గత 14 రోజులుగా విశాఖ జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు నమోదుకాలేదు. ఇదే విషయాన్ని కేంద్రం కూడా వెల్లడించింది. గడిచిన రెండు వారాలుగా ఒక్క కేసూ నమోదుకాని జిల్లాలు 11 ఉండగా.. అందులో విశాఖపట్నం కూడా ఒకటని కేంద్రం తెలిపింది. అయితే, శనివారం(ఏప్రిల్ 18,2020) నిర్వహించిన పరీక్షల్లో ఒకరికి వైరస్ నిర్ధారణ అయినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది.

జిల్లాల వారీగా కరోనా పాజిటివ్‌ కేసులు:
అనంతపురం : 29
చిత్తూరు : 28 
తూర్పు గోదావరి : 24
గుంటూరు : 129 
కడప : 37
కృష్ణా : 75
కర్నూలు : 158
నెల్లూరు : 67
ప్రకాశం : 44
విశాఖపట్నం : 21
పశ్చిమ గోదావరి : 35

Also Read | ఏపీలో లాక్ డౌన్ సడలింపులు‌.. తెరుచుకునే పరిశ్రమలు ఇవే, ఈ నియమాలు మస్ట్