Tenth, Inter Exams : ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు చేస్తూ, ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు ఉంటాయా లేదా అనే అనుమానం విద్యార్థుల్లో పెరిగిపోయింది. ఏపీలో పరీక్షలపై ప్రభుత్వం క్లారిటీ

Tenth, Inter Exams : ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

Ap Tenth Inter Exams Cancel

Updated On : April 14, 2021 / 10:43 PM IST

AP Tenth Inter Exams Cancel : కరోనా నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు చేస్తూ, ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు ఉంటాయా లేదా అనే అనుమానం విద్యార్థుల్లో పెరిగిపోయింది.

ఈ క్రమంలో ఏపీలో పరీక్షలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదని.. షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. సమీప భవిష్యత్తులో కొవిడ్ కేసులు పెరిగితే అప్పుడు పరీక్షల నిర్వహణపై ఆలోచిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఇప్పటికైతే యధావిధిగా షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు జరిపే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు. రేపు(ఏప్రిల్ 15,2021) సీఎం జగన్ తో సమీక్షలో పరీక్షల నిర్వహణపై చర్చిస్తామన్నారు.

అన్ని పాఠశాలల్లో కోవిడ్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని.. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ ప్రతి రోజూ పరిస్థితిని సమీక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

అటు ఒకటి, రెండు రోజుల్లో పదో పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం సైతం ఓ నిర్ణయం తీసుకోనుంది. Cbse నిర్ణయాన్నే తెలంగాణలోనూ అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికైతే షెడ్యూల్ ప్రకారం మే ఒకటి నుండి ఇంటర్.. మే 17 నుండి 10 వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. కాగా కరోనాతో ఈ నెల 7 నుండి జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష లను ఇంటర్ బోర్డు వాయిదా వేసింది.

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో వచ్చే(మే) నెలలో జరగాల్సిన సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నట్లు బుధవారం(ఏప్రిల్ 14,2021) ప్రకటించింది.

‘‘దేశంలో మహమ్మారి ఉద్ధృతి.. పాఠశాలల మూసివేత నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మే 4 నుంచి జరిగే సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నాం. బోర్డు తయారు చేసే ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ఆధారంగా పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తాం. ఇక 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నాం. జూన్‌ 1న కరోనా పరిస్థితిని సమీక్షించిన అనంతరం 12వ తరగతి పరీక్షల తేదీలపై నిర్ణయం తీసుకుంటాం. పరీక్షలు ప్రారంభించడానికి 15 రోజుల ముందుగానే వివరాలను ప్రకటిస్తాం’’ అని కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్విటర్‌లో తెలిపారు.

పదో తరగతి విద్యార్థుల ప్రతిభ, అంతర్గత అధ్యయనం ఆధారంగా మార్కుల కేటాయింపు జరుగుతుందన్న కేంద్రమంత్రి.. ఫలితాలపై అభ్యంతరాలుంటే ఆఫ్‌లైన్‌లో పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. కరోనా ఉద్ధృతి తగ్గిన తర్వాత అనువైన సమయంలో పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

కరోనా విజృంభణ దృష్ట్యా వార్షిక పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయి పరీక్షలపై చర్చలు జరిపారు. విద్యార్థుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ప్రధాని చెప్పినట్లు రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. అకడమిక్‌ ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని మోదీ సూచించినట్లు చెప్పారు.