AP Government: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..

8 వారాల్లో అధ్యయన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. తదుపరి చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవోను..

AP Government: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..

Updated On : December 11, 2025 / 7:48 PM IST

AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈహెచ్ఎస్ ద్వారా వైద్య సేవలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈహెచ్ఎస్ కార్డుల ద్వారా వైద్య సేవల్లో వస్తున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సమస్యల పరిష్కారం కోసం ఏడుగురు సభ్యులతో అత్యున్నత స్థాయి కమిటీ నియమించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఉన్నత స్థాయి కమిటీ నియామిస్తూ ఉత్తర్వులిచ్చారు.

ఉన్నత స్థాయి కమిటీ ఛైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించారు. కమిటీలో సభ్యులుగా జీఎడీ, ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నారు. కమిటీలో సభ్యులుగా ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ విద్యాసాగర్ ను నియామించారు. కమిటీలో సభ్యుడిగా ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోషియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు.. కమిటీ సభ్యుడు, కన్వీనర్ గా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవోను నియామించారు.

ఈహెచ్ఎస్ కార్డుల ద్వారా మెరుగ్గా వైద్య సేవలు అందించే అంశంపై అధ్యయనం చేయాలని కమిటీకి ఆదేశాలు అందాయి. 8 వారాల్లో అధ్యయన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. తదుపరి చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవోను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read: ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు.. గిరిజన సంక్షేమ స్కూళ్లలో టీచర్ పోస్టుల అప్‌గ్రేడ్.. ఛైర్మన్లు, మెంబర్ల నియామకాలు.