Anna Canteens : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్నక్యాంటీన్ల సేవలు ఇకనుంచి వారికి కూడా అందుబాటులోకి.. ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
Andhra Pradesh : ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరాలు, పట్టణాల్లో రోజుకు లక్షలాది మందికి కేవలం రూ.5కే భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు చర్యలు చేపట్టింది.
AP Government Anna Canteens in Rural Areas
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు
- రేపటి నుంచి అందుబాటులోకి 62 క్యాంటీన్లు
- పల్నాడు జిల్లా ధరణికోటలో ప్రారంభించనున్న చంద్రబాబు
AP Anna Canteens : ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరాలు, పట్టణాల్లో రోజుకు లక్షలాది మందికి కేవలం రూ.5కే భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్లను మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం, నగరాలు, పట్టణాల్లోని ప్రజలకు.. గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ పనులపై నగరాలకు, పట్టణాలకు వచ్చిన ప్రజలకు అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే నాణ్యమైన భోజనాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. అయితే, తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Also Read : ఏపీ ప్రజలకు హైఅలర్ట్.. ఈ సమయాల్లో బయటకు రావొద్దు.. APSDM కీలక హెచ్చరికలు జారీ చేసిన
ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం పురపాలక, నగరపాలక సంస్థల్లో 207 క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. అయితే, అన్న క్యాంటీన్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలో 62 క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. వీటిని బుధవారం సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. పల్నాడు జిల్లా ధరణికోటలో అన్న క్యాంటీన్ ను మధ్యాహ్నం ప్రారంభించి పేదలతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు భోజనం చేస్తారు. దీంతో రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల సంఖ్య 269కి పెరగనుంది.
ఏపీ విభజన తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పట్టణ, నగర ప్రాంతాల్లోని పేదలకు, గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ పనులపై పట్టణాలకు వచ్చిన వారికి రూ.5కే భోజనం అందించింది. అయితే, వైసీపీ హయాంలో ఈ క్యాంటీన్లు మూతపడ్డాయి. మళ్లీలో ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్లు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి.
ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 207 క్యాంటీన్ల ద్వారా రోజుకు 2.10లక్షల మంది భోజనాలు చేస్తున్నారు. ఇందుకు రోజుకు రూ.54లక్షలపైగా వ్యయం అవుతుంది.. సబ్సిడీ కింద ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.243 కోట్లు ఖర్చు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసే క్యాంటీన్లపై సబ్సిడీ కింద ఏడాదికి రూ.58 కోట్ల వ్యయం కానుంది.
ఇప్పటి వరకు నగర, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన అన్న క్యాంటీన్లు.. గ్రామీణ ప్రాంతాల్లోని ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకురావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూరల్ ప్రజలకు కూడా అన్న క్యాంటీన్ల ద్వారా తక్కువ ధరకే పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో వీటిని నెలకొల్పుతున్నారు. ప్రస్తుతం బుధవారం ఒకేరోజు 62 క్యాంటీన్లను ప్రారంభం కానున్నాయి. రాబోయే కాలంలో వీటి సంఖ్య మరింత పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
