Bharat Bandh : ఈనెల 26న భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు తెలిపింది. రైతాంగ, ఉక్కు ఉద్యమాలకు మద్దతు ప్రకటించింది.

Bharat Bandh : ఈనెల 26న భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు

Bharat Bandh

Updated On : March 23, 2021 / 9:27 PM IST

AP government support for the Bharat Bandh : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు తెలిపింది. రైతాంగ, ఉక్కు ఉద్యమాలకు మద్దతు ప్రకటించింది. ఈనెల 26న ఏపీలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులు బంద్ చేయనున్నారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. మార్చి 26న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ.. ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగని పోరాటం చేస్తున్న రైతు సంఘాలు నేతలు బుధవారం (మార్చి 10) సమావేశమై.. తదుపరి కార్యాచరణపై చర్చించారు. వ్యవసాయ చట్టాలపై తాము చేస్తున్న ఆందోళన మార్చి 26 నాటికి నాలుగు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో భారత్‌ బంద్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

మార్చి 26న పూర్తి స్థాయిలో భారత్‌ బంద్‌ చేపట్టనున్నట్లు రైతు నేత బూటా సింగ్‌ తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా శాంతియుతంగా ఈ బంద్‌ కొనసాగుతుందని వెల్లడించారు. అదేవిధంగా పెరిగిన ఇంధన ధరలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 25న ట్రేడ్‌ యూనియన్లతో కలిసి ఆందోళనలో పాల్గొనున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 29న ‘హోలీ కా దహన్‌’ పేరుతో వ్యవసాయ చట్టాల ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేయనున్నట్లు వెల్లడించారు.