World Bank : ఏపీకి రూ.1,860 కోట్ల రుణం.. వరల్డ్ బ్యాంకుతో ప్రభుత్వం కీలక ఒప్పందం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరల్డ్ బ్యాంకుతో కీలక ఒప్పందం చేసుకుంది. రూ.1,860 కోట్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం..

World Bank : ఏపీకి రూ.1,860 కోట్ల రుణం.. వరల్డ్ బ్యాంకుతో ప్రభుత్వం కీలక ఒప్పందం

World Bank

Updated On : November 23, 2021 / 10:27 PM IST

World Bank : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరల్డ్ బ్యాంకుతో కీలక ఒప్పందం చేసుకుంది. రూ.1,860 కోట్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 18న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల సమక్షంలో ఈ రుణ ఒప్పందంపై ఏపీ అధికారులు సంతకాలు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల పాఠశాలల్లోని 50 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ ఒప్పందం ద్వారా లబ్ది చేకూరనుందని వివరించాయి.

Petrol : వాహనదారులకు గుడ్‌న్యూస్.. మరింత తగ్గనున్న పెట్రోల్ ధరలు..!

ఈ రుణంతో ప్రత్యేక ప్రాజెక్టు తీసుకురానుంది ప్రభుత్వం. దీని వల్ల 45 వేల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, టీచర్లు, అంగన్ వాడీ సిబ్బందికి ప్రయోజనం కలగనుంది. ఈ ప్రాజెక్ట్‌లో పేద, గిరిజన విద్యార్థులు, బాలికలకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. అంగన్ వాడీ టీచర్లకు, సిబ్బందికి ప్రత్యేక ఫౌండేషన్ కోర్సులు ప్రవేశ పెట్టనున్నారు. డిజిటల్ వసతులు లేక విద్యలో నష్టపోతున్న పేద గిరిజన విద్యార్థుల కోసం టెలివిజన్, రేడియోలో ప్రత్యేక కంటెంట్ రూపకల్పన చేయాలని భావిస్తున్నారు.

SBI Alert : ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్.. ఆ నెంబర్లతో జాగ్రత్త!

ప్రభుత్వ పాఠశాలలను అత్యుత్తమ విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నది ఏపీ ప్రభుత్వం విజన్‌. ఇందులో భాగంగా విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడం కోసం ప్రపంచ బ్యాంకుతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నాయి.