Annadata Sukhibhava : అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ‘అన్నదాత సుఖీభవ’ డబ్బులు పడేది అప్పుడే.. కీలక ఆదేశాలివే..!
Annadata Sukhibhava : ఏపీ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది. తేదీ వివరాలను కూడా రివీల్ చేసింది.

Annadata Sukhibhava
Annadata Sukhibhava : అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల (ఆగస్టు) 2న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ నిధులను జమ చేయనున్నట్టు ప్రకటించింది. అన్నదాత సుఖీభవ తొలివిడత డబ్బుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్ట్ నెలలో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పంపిణీ చేసేందుకు చర్యలు మొదలుపెట్టింది.
సూపర్ సిక్స్‌లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఇదే విషయమై సీఎస్ విజయానంద్ సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ ఈ పథకం కింద డబ్బులు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు అధికారులకు ఆయన కీలక ఆదేశాలిచ్చారు.
లబ్దిదారులైన రైతుల వివరాలను మరోసారి క్షుణ్టంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. మరో 3 రోజుల వరకు పెండింగ్‌లో ఉన్న లబ్దిదారులు రైతు సేవా కేంద్రాల వద్ద సంప్రదించాలని సూచించారు. అదేవిధంగా, రాష్ట్ర రైతులకు ఆర్దికంగా చేయూత అందించే లక్ష్యంతో అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి రూ. 20 వేలు అందిస్తున్నట్లు సీఎస్ విజయానంద్ తెలిపారు.
కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ సాయం అందించే దిశగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, సీసీఆర్సీ కార్డు కలిగిన కౌలు రైతులు ఇ- క్రాప్ తప్పనిసరిగా ఉండాలని సూచనలు చేసింది. వచ్చే అక్టోబర్‌లో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ యోజన నిధులు వస్తాయని ఆయన వివరించారు. ఆగస్టు 2వ తేదీన డబ్బులు అకౌంట్లలో పడతాయని చెప్పారు.