Special vaccine Drive : ఏపీలో రేపు 8లక్షల మందికి వ్యాక్సిన్

ఏపీ ప్రభుత్వం రేపు పెద్ద ఎ్తతున కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. రేపు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది.

Special vaccine Drive : ఏపీలో రేపు 8లక్షల మందికి వ్యాక్సిన్

Special Vaccine Drive

Updated On : June 19, 2021 / 2:46 PM IST

Special vaccine Drive : ఏపీ ప్రభుత్వం రేపు పెద్ద ఎ్తతున కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. రేపు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

వైద్య,ఆరోగ్య శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఒకే రోజు 6లక్షల వ్యాక్సిన్లు వేసి చరిత్ర సృష్టించిన ఏపీ పభుత్వం రేపు 8లక్షల వ్యాక్సిన్లు వేసి చరిత్ర సృష్టించే పనిలో ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోటి 22లక్షల 83వేల 479 డోసులు వేశారు.