EBC Nestham : మహిళలకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.15వేలు

అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ఈ నెల 25 నుంచి ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇందుకోసం రూ.580 కోట్లు..

EBC Nestham : మహిళలకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.15వేలు

Ebc Nestham

Updated On : January 21, 2022 / 4:54 PM IST

EBC Nestham : రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణ మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ఈ నెల 25 నుంచి ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇందుకోసం రూ.580 కోట్లు విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 45 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో భాగంగా ప్రతి ఏటా రూ.15వేల చొప్పున మూడేళ్లలో రూ.45వేలు ఆర్థిక సాయం అందనుంది.

AP Cabinet : ఉద్యోగుల పీఆర్సీ జీవోలకు ఆమోదం..రిటైర్‌‌మెంట్ 62 ఏళ్లకు పెంపు

వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తంలో ఉన్న లబ్ధిదారులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలు ఈ పథకానికి అనర్హులు కారు. కేవలం ఈబీసీ మహిళలు మాత్రమే అర్హులు. అంతేకాదు లబ్ధిదారుల పేరుతో ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉండాలి.

AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు

ఇక వార్షిక కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో నెలకు రూ. 12 వేలు పరిమితిని మించకూడదు. ఈ పథకంలో లబ్ధిదారులకు మాగాణి భూమి 3 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి లేదా మెట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి. లేదా మాగాణి, మెట్ట భూమి రెండూ కలిపి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి. కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి గాని, పెన్షనర్ గాని ఉండకూడదు. అయితే ఈ నిబంధనలో పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇచ్చారు. కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా ఫోర్ వీలర్ ఉండకూడదు. కుటుంబంలో ఎవరూ ఇన్‌కమ్ ట్యాక్స్ కడుతున్న వారు ఉండకూడదు.