ఏపీలో ఈ నెల 19 నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు

  • Published By: sreehari ,Published On : September 17, 2020 / 10:00 PM IST
ఏపీలో ఈ నెల 19 నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు

Updated On : September 17, 2020 / 10:16 PM IST

ఏపీలో సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 19న విజయవాడ, విశాఖలో సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సిటీ బస్సులు రోడ్డెక్కనే లేదు.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సిటీ బస్సులను ఏపీ ఆర్టీసీ యాజమాన్యం నడపనుంది.



మరోవైపు ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.. మొన్నటివరకూ భారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గాయి.. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య పెరుగుతోంది.. కరోనా పాజిటివ్ కేసుల కంటే కోలుకుని డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య అధికంగా ఉంది.. కరోనాతో తూర్పు గోదావరి మినహా మిగతా జిల్లాల్లో కరోనా ప్రభావం తగ్గినట్టే కనిపిస్తోంది..

గత 24 గంటల్లో కరోనా నుంచి 10,712 మంది పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 77,492 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో 8,702 మంది కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏపీలో ఇప్పటివరకూ 6 లక్షల కరోనా పాజిటివ్ కేసులు దాటేశాయి.