AP Govt: కొత్త జిల్లాల ఆవిర్భావ ప్రకటన వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమైన సంగతి తెలిసిందే. మొత్తం 26..

AP Govt: కొత్త జిల్లాల ఆవిర్భావ ప్రకటన వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?

Ap Govt (1)

Updated On : April 1, 2022 / 6:57 AM IST

AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమైన సంగతి తెలిసిందే. మొత్తం 26 జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనల నివేదికను రూపొందించిన ప్రభుత్వం.. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై వేగం పెంచింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం కూడా తీసుకున్న ప్రభుత్వం ఆవిర్భావ ప్రకటన తేదీకి ముహూర్తం కూడా ఖరారు చేసుకుంది.

AP Govt: బ్రేకింగ్.. స్పెషల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల రద్దు!

తెలుగు సంవత్సరాది ఉగాది నాడు ఏపీ ప్రభుత్వం ఈ కొత్త జిల్లాల ఆవిర్భావంపై ప్రకటన చేయాలనీ.. అందుకు భారీ వేడుక నిర్వహించేందుకు కూడా సిద్ధమైంది. ఉగాది రోజున కొత్త జిల్లాల ప్రకటన రానున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 2న ఉగాది రోజున సెలవు లేనట్లు ప్రభుత్వం గతంలో ప్రకటన చేసింది. అయితే.. ఇప్పుడు ఈ ప్రకటన వాయిదా పడడంతో యధావిధిగా ఉగాది రోజును సెలవుగా ప్రకటించింది ప్రభుత్వం.

AP Govt Employees : 35 ఏళ్ల తర్వాత సమ్మెలోకి ప్రభుత్వ ఉద్యోగులు

ఇక, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లాల ఆవిర్భావ ప్రకటన ఉండే అవకాశం ఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ మేరకే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించగా.. కొన్ని జిల్లాల ఏర్పాటు, జిల్లాల కేంద్రాలతో ప్రాంతాలకు పెరిగిన దూరాలపై విమర్శలు కూడా కనిపిస్తున్నాయి.