AP Fever Survey : ఏపీలో ఇంటింటికీ ఫీవర్ సర్వే..
కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’గా హడలెత్తిస్తున్న క్రమంలో ఏపీలో ప్రభుత్వం ఇంటింటికీ ఫీవర్ సర్వే ప్రారంభించింది. ఈరోజు నుంచి డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే ప్రారంభించింది.

Ap Govt Started Fever Survey Door To Door
AP Govt started fever survey door to door : కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’గా హడలెత్తిస్తోంది. ఈక్రమంలో ఏపీలో ప్రభుత్వం ఇంటింటికీ ఫీవర్ సర్వే ప్రారంభించింది. ఈరోజు నుంచే డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే ప్రారంభించింది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఇండియాలో చాపకిందనీరులా విస్తరిస్తున్న క్రమంలో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. భారత్ లో కూడా ఎంటర్అయిన ఒమిక్రాన్ అంతకంతకు విస్తరిస్తోంది. కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 150 దాటిపోయింది. 155 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి.
Read more : Oral Covid Drug : త్వరలో నోటి ద్వారా కొవిడ్ మెడిసిన్..క్లినికల్ ట్రయల్స్ షురూ..
ఏపీలో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని విమానాశ్రయాల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది. మరోవైపు ఈరోజునుంచి డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే నిర్వహిస్తోంది వైద్య ఆరోగ్యశాఖ.
ఈరోజు నుంచి రాష్ట్రమంతా వారానికి ఐదురోజులు ఇంటింటికీ ఫీవర్ సర్వే చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఆశావర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోనున్నారు. జ్వర పరీక్షలు చేస్తున్నారు. ఎవరికైనా జ్వరంతో పాటు కోవిడ్ లక్షణాలుంటే సంబంధిత ఏఎన్ఎంతో పాటు మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తారు.
Read more : తెలంగాణలో ఒమిక్రాన్ బాధితుడికి సీరియస్
కోవిడ్ పరీక్షలు చేసి..ఆ పరీక్షల ఆధారంగా హోం ఐసోలేషన్ లో ఉండేలా..దానికి తగిన చికిత్స్ కోసం ఆరోగ్య కార్యకర్తలు బాధితులకు కుటుంబ సభ్యులకు సూచనలిస్తారు. ఉచితంగా మందుల కిట్ ఇవ్వడంతో పాటు వైద్యుల పర్యవేక్షణలో కావల్సిన సహాయం అందిస్తారు. ఈ సర్వే డేటాను ఆన్‌లైన్ యాప్‌లో నిక్షిప్తం చేయనున్నారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసి..పాజిటివ్‌గా తేలితే జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు పంపిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.