టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ.. ఇక డిసెంబరు 2లోగా..

రవికుమార్‌ ఆస్తులపై దర్యాప్తు చేయాలని కూడా ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది.

టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ.. ఇక డిసెంబరు 2లోగా..

Updated On : October 27, 2025 / 2:55 PM IST

AP High Court: టీటీడీ పరకామణి కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరకామణి కేసును సీఐడీ అత్యవసరంగా విచారణ జరపాలని చెప్పింది.

పరకామణి కేసులో ఇప్పటికే టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఏవీఎస్‌వో సతీశ్ కుమార్, చోరీకి పాల్పడిన రవికుమార్‌ రాజీ చేసుకున్నారని పిటిషన్‌లో అనిల్ సింఘాల్ పేర్కొన్నారు.

చోరీ కేసును లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకోవడంపై కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తూ.. రవికుమార్‌ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. కేసు రాజీ చేసుకోవడంపై టీటీడీ బోర్డు, అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలని చెప్పింది.

Also Read: ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటో.. పిచ్చెక్కిస్తున్నాడు.. ఎవడ్రా నువ్వు అసలు..

రవి కుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్లు, ఆస్తులను పరిశీలించాలని పేర్కొంది. ఆస్తుల బదలాయింపులు జరిగాయా? అన్న విషయాన్నీ తేల్చాలని ఆదేశించింది.

తదుపరి విచారణ జరిగేలోపు రిపోర్టు అందించాలని సీఐడీతో పాటు ఏసీబీకి చెప్పింది. పరకామణి కేసును సీఐడీ డిసెంబర్ 2 నాటికి పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 2న జరగనుంది.