AP High Court: చంద్రబాబు పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
సీఐడీ మెమోను పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు. సాక్షులను లోకేశ్ ప్రభావితం చేస్తున్నారని సీఐడీ మెమోలో చెప్పారని..

Chandrababu
Chandrababu Naidu: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ మెమోపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు.
టీడీపీ నేత నారా లోకేశ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కేసుకు సంబంధం లేదని చంద్రబాబు అన్నారు. సీఐడీ మెమోను పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు. సాక్షులను లోకేశ్ ప్రభావితం చేస్తున్నారని సీఐడీ మెమోలో చెప్పారని అన్నారు. అంతేగానీ, చంద్రబాబు అలా చేశారని ఎక్కడా చెప్పలేదని తెలిపారు.
లోకేశ్ మీడియాలో మాట్లాడిన సమయంలో ఐఆర్ఆర్, హెరిటేజ్ ఫుడ్స్, లింగమ నేని గురించి ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. చంద్రబాబు సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఎక్కడా ఉల్లంఘించలేదని చెప్పారు. సీఐడీ మెమోను తిరస్కరించాలని కోరారు. దీంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
చంద్రబాబు కేసులను విచారిస్తున్న అధికారులపై టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక చర్యలు తీసుకుంటామని లోకేశ్ అంటున్నారని నిన్న కోర్టుకు సీఐడీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని నిన్న సీఐడీ కోరింది.
Chandrababu: అక్రమ అరెస్టులపై కాదు.. అంగన్‌వాడీ సమస్యలపై దృష్టిపెట్టండి : చంద్రబాబు