AP Inter Supply Results: ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఇవాళ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాలను విద్యార్థులు https://resultsbie.ap.gov.in/లో ఫలితాలు చూసుకోవచ్చు. ఆ వెబ్ సైట్ ఓపెన్ చేసిన అనంతరం విద్యార్థులు ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాల లింకుపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఓపెన్ అయిన పేజీలో హాల్ టికెట్ నంబరు, పుట్టినరోజు తేదీలను ఎంటర్ చేసి, ఫలితాలు చూసుకోవచ్చు.

AP Inter Results
AP Inter Supply Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఇవాళ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాలను విద్యార్థులు https://resultsbie.ap.gov.in/లో ఫలితాలు చూసుకోవచ్చు. ఆ వెబ్ సైట్ ఓపెన్ చేసిన అనంతరం విద్యార్థులు ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాల లింకుపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఓపెన్ అయిన పేజీలో హాల్ టికెట్ నంబరు, పుట్టినరోజు తేదీలను ఎంటర్ చేసి, ఫలితాలు చూసుకోవచ్చు.
ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలను దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు రాసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ పరీక్షలను ఆగస్టు 3 నుంచి 12 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించగా, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు.
COVID 19: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 6 వేల కన్నా తక్కువగా నమోదు