AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. ఆ నలుగురిని కలిపి విచారించాలి.. వారం రోజుల కస్టడీకి సిట్ పిటిషన్

మరోవైపు కేసిరెడ్డి వాంగ్మూలం రికార్డ్ చేసేందుకు అనుమతివ్వాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పిటిషన్ వేసింది. దీనిపై విచారణ రేపటికి వాయిదా పడింది.

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. ఆ నలుగురిని కలిపి విచారించాలి.. వారం రోజుల కస్టడీకి సిట్ పిటిషన్

Updated On : May 19, 2025 / 5:59 PM IST

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులైన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గోవిందప్పను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు.

ఆ నలుగురిని కలిపి విచారించాల్సిన అవసరముందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఏసీబీ కోర్టు రేపు విచారణ జరిపే అవకాశం ఉంది. మరోవైపు కేసిరెడ్డి వాంగ్మూలం రికార్డ్ చేసేందుకు అనుమతివ్వాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పిటిషన్ వేసింది. దీనిపై విచారణ రేపటికి వాయిదా పడింది.

ఏపీలో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ-1గా ఉన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప నిందితులుగా ఉన్నారు.

Also Read: టిఫిన్ బాక్స్ బాంబులు చేయాలని ఆదేశాలు, అమెజాన్ నుంచి కొనుగోలు.. హైదరాబాద్‌ పేలుళ్లకు కుట్ర కేసులో సంచలన విషయాలు..

మద్యం ముడుపులు, కమిషన్ వ్యవహారంలో ఈ నలుగురికి తెలిసి కొన్ని విషయాలు జరిగాయని సిట్ అధికారులు చెబుతున్నారు. అందుకే, ఆ నలుగురిని కలిపి విచారించాల్సిన అవసరం ఉందంటున్నారు. అప్పుడే ఈ కేసులో దర్యాప్తునకు అవకాశం ఉంటుందన్నారు. నలుగురు కీలక నిందితుల కస్టడీ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు కేసిరెడ్డి వాంగ్మూలం రికార్డ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని విజయవాడ కోర్టులో మూడు రోజుల క్రితం పిటిషన్ వేసింది ఈడీ. ఈ పిటిషన్‌ ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చింది. కేసిరెడ్డి వాంగ్మూలం రికార్డ్ చేసేందుకు అనుమతివ్వాలని ఈడీ తరపు న్యాయవాదులు కోరారు. కాగా, విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.