AP Liquor Scam Timeline: ఏపీ లిక్కర్ స్కాం.. ఎప్పుడు ఏం జరిగింది?.. కేసు పెట్టినప్పటి నుంచి.. చార్జిషీట్ వరకు.. టైమ్ లైన్

ఎవరెవరికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు? ఎవరిని ఎప్పుడు విచారించారు? ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేశారు?

AP Liquor Scam Timeline: ఏపీ లిక్కర్ స్కాం.. ఎప్పుడు ఏం జరిగింది?.. కేసు పెట్టినప్పటి నుంచి.. చార్జిషీట్ వరకు.. టైమ్ లైన్

Updated On : July 19, 2025 / 8:36 PM IST

AP Liquor Scam Timeline: లిక్కర్ స్కామ్ కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం అనేక మలుపులు తిరిగింది. ఈ స్కామ్ వైసీపీ కీలక నేతల మెడకు చుట్టుకుంది. ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. త్వరలో కీలక నాయకులు అరెస్ట్ కానున్నారని సమాచారం. ఇక లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణంపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది సిట్. లిక్కర్ కేసు ఛార్జ్‌షీట్‌ను విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో అందజేశారు సిట్ అధికారులు.

300 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జిషీట్ ను కోర్టుకు సమర్పించారు. ఈ నెల 22తో ఏ1 రాజ్‌ కేసిరెడ్డిని అరెస్ట్ చేసి 90 రోజులు ముగుస్తున్నందున ఛార్జిషీట్‌ దాఖలు చేశారు సిట్ అధికారుల. ఇక మద్యం కేసులో ఏ4గా ఉన్నారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. త్వరలోనే ఆయన అరెస్ట్ ను సిట్ అధికారులు చూపనున్నారని సమాచారం. ఇప్పటికే మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ను హైకోర్టు కొట్టివేసింది. మిథున్ రెడ్డి సిట్ విచారణ కొనసాగుతోంది. రేపు(జూలై 20) ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

రాష్ట్రంలో సంచలనం రేపిన ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎప్పుడు ఏం జరిగింది?.. ఎవరెవరికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు? ఎవరిని ఎప్పుడు విచారించారు? ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేశారు? కేసు పెట్టినప్పటి నుంచి.. చార్జిషీట్ వరకు.. టైమ్ లైన్..

* 2024 సెప్టెంబర్ 25న కేసు నమోదు చేసిన సీఐడీ
* 2024 అక్టోబర్ 22, 23 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం డిస్టిలరీ కంపెనీల్లో తనిఖీలు
* 2025 ఫిబ్రవరి 5న మద్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో
* 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం అక్రమాలపై సిట్
* విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో మొత్తం ఏడుగురు సభ్యులతో సిట్
* సిట్‌కు కావాల్సిన సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించిన ప్రభుత్వం
* ప్రతి 15 రోజులకోసారి దర్యాప్తు అంశాలను ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
* మార్చి 12న సిట్‌ విచారణకు హాజరైన ఎంపీ విజయసాయిరెడ్డి
* మద్యం కుంభకోణం కీలకపాత్రధారి రాజ్ కేసిరెడ్డి అని మీడియాకు తెలిపిన విజయసాయిరెడ్డి
* మార్చి 21న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసిన ఎంపీ మిథున్‌రెడ్డి

* మద్యం కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని మిథున్‌రెడ్డి పిటిషన్
* ఏప్రిల్ 14న హైదరాబాద్‌లోని రాజ్ కేసిరెడ్డి కంపెనీలు, నివాసంలో సిట్ తనిఖీలు
* ఏప్రిల్ 16న రాజ్ కేసిరెడ్డికి సిట్ నోటీసులు
* ఏప్రిల్ 19న విచారణకు హాజరుకావాలని సిట్‌ నోటీసులు
* నాలుగుసార్లు రాజ్ కేసిరెడ్డికి సిట్‌ నుంచి నోటీసులు
* ఏప్రిల్ 15న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ మరోసారి నోటీసులు
* ఏప్రిల్ 18న సిట్ విచారణకు హాజరుకావాలని విజయసాయిని కోరిన సిట్‌
* ఏప్రిల్ 18న విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
* ఏప్రిల్ 18న సిట్‌ విచారణకు వచ్చిన రాజ్ కేసిరెడ్డి తండ్రి ఉపేంద్ర
* ఏప్రిల్ 19న సిట్‌ విచారణకు హాజరైన ఎంపీ మిథున్‌రెడ్డి

Also Read: ఏపీలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. కరెంట్ బిల్లులు కట్టడం ఇప్పుడు ఇంకా సింపుల్.. జస్ట్..

* ఏప్రిల్ 21న హైకోర్టులో రాజ్ కేసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌
* ఏప్రిల్ 22న విదేశాలకు పారిపోయే యత్నంలో రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్
* ఏప్రిల్ 24న మద్యం కేసులో బూనేటి చాణక్య అరెస్ట్
* ఏప్రిల్ 25న మద్యం కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డి అరెస్ట్
* మే 2న మద్యం కేసులో నిందితుడు దిలీప్ అరెస్ట్
* మే 8న సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి ఇళ్లలో సిట్‌ తనిఖీలు
* మద్యం కుంభకోణంపై వివరాలు కోరిన ఈడీ
* మే 8న ఈడీ అధికారుల నుంచి సిట్‌కు అందించిన లేఖ
* మే 9న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీకి సిట్ నోటీసులు
* మే 14న గోవిందప్ప బాలాజీని కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో అరెస్ట్ చేసిన సిట్‌

* మే 14న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి సిట్ విచారణకు హాజరు
* మే 16 వరకు మూడు రోజులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి విచారణ
* ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు
* మే 16న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్
* జూన్ 18న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్‌ నాయుడును ఎయిర్‌పోర్టులో అడ్డిగింత
* బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఇద్దరినీ అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
* జూన్‌ 18న బెంగళూరు వెళ్లి చెవిరెడ్డి, వెంకటేశ్‌నాయుడిని అరెస్ట్ చేసిన సిట్‌
* జులై 12న సిట్‌ విచారణకు హాజరుకావాలని విజయసాయికి నోటీసులు
* సిట్‌కు సమాచారం ఇచ్చి విచారణకు గైర్హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
* ఈ నెల 18న ముందస్తు బెయిల్‌ విషయంలో సుప్రీంకోర్టులో మిథున్‌రెడ్డికి దక్కని ఊరట

* ఇప్పటికే హైకోర్టులో మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత
* విదేశాలకు పారిపోకుండా లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ చేసిన సిట్‌
* మద్యం కేసులో మిథున్‌రెడ్డి అరెస్ట్ కు ఈనెల 18న ఏసీబీ కోర్టులో సిట్‌ పిటిషన్‌
* శనివారం(జూలై 19) సిట్ కార్యాలయంలో విచారణకు వచ్చిన ఎంపీ మిధున్ రెడ్డి, అరెస్ట్ చేసే అవకాశం.