ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

AP local body election schedule : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. 2021, జనవరి 08వ తేదీ శుక్రవారం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ షెడ్యూల్ విడుదల చేశారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 05, 09, 13, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ వెల్లడించింది. దీంతో 2021, జనవరి 09వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.
– జనవరి 23 తొలి దశ, జనవరి 27 రెండో దశ, జనవరి 31న మూడో దశ, ఫిబ్రవరి 04వ తేదీన నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్.
– ఫిబ్రవరి 05వ తేదీన తొలి దశ, ఫిబ్రవరి 07వ తేదీన రెండో దశ, ఫిబ్రవరి 09వ తేదీన మూడో దశ, ఫిబ్రవరి 17వ తేదీన నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్.
– ఉదయం 06.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్.