గవర్నర్ వద్దకు ఏపీ ‘స్థానిక’ పంచాయతీ : వివరాలతో ఈసీ రమేశ్ రెడీ..ఏం చెబుతారు

ఏపీ గవర్నర్ వద్దకు స్థానిక ఎన్నికల పంచాయతీ చేరింది. ఎన్నికలను వాయిదా వేయడంపై గుర్రుగా ఉంది ఏపీ ప్రభుత్వం. నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లిన సీఎం జగన్..రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రమేశ్ కుమార్‌పై ఫిర్యాదు చేసింది. విచక్షణాధికారాలను ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రమేశ్ చెప్పడంపై జగన్ చాలా సీరియస్‌గా ఉన్నారు. ప్రతొక్కరికీ విచక్షణాధికారం వాడడం అలవాటైపోయిందని, ఈయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళుతామని వైసీపీ శ్రేణులు ప్రకటించాయి. ఈ క్రమంలో..గవర్నర్‌తో భేటీ అయ్యేందుకు ఎన్నికల అధికారిర రమేశ్ రెడీ అయ్యారు.
2020, మార్చి 16వ తేదీ సోమవారం గవర్నర్ విశ్వభూషణ్‌ని రమేశ్ కుమార్ కలువనున్నారు. ఎన్నికలను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది ? ఎలాంటి కారణాలున్నాయి ? తదితర వివరాలను తెలియచేయనున్నారు. అయితే..ఏ రిపోర్టు ఇస్తారు ? ఎలా తన నిర్ణయాన్ని సమర్థించుకుంటారానేది పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
Also Read | ఏం కర్మరా బాబూ, పోసుకుందామని BMW ఆపాడు, కట్ చేస్తే కారు లేదు..
ప్రస్తుతం SEC తీసుకున్న నిర్ణయం వల్ల అభివృద్ధి పనులు ఆగిపోతాయని, స్థానిక సంస్థలకు అందాల్సిన రూ. 5 వేల కోట్ల నిధులు అందకుండా పోతాయని సీఎం జగన్ వాదిస్తున్నారు. కానీ..ఇక్కడ రమేశ్ కుమార్ రెడ్డి వాదన మరోలా ఉంది. కరోనా వైరస్ దృష్ట్యా సమూహంగా ఉండొదని, ఇతరత్రా వాటిపై కేంద్ర ప్రభుత్వం సూచించిందని..ఈ వైరస్ కట్టడి చేసే క్రమంలో ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చిందని, రద్దు చేయాలని వెల్లడిస్తోంది. అయితే..ఏపీలో కరోనా అంతగా విజృంభించలేదని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటోందని..వైరస్ సాకుగా చూపెట్టి..ఎన్నికలను వాయిదే వేయొద్దంటోంది వైసీపీ.
ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు మాత్రం సమర్థించాయి. కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని, ఏకగ్రీవాలను రద్దు చేయాలని టీడీపీ కోరుతోంది. జనసేన సేమ్ ఇదే విధంగా రెస్పాండ్ అయ్యింది. బీజేపీ మాత్రం వెల్ కమ్ చెప్పింది. కానీ…స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. మరి ఈసీ అధికారి ఇచ్చే వివరణపై గవర్నర్ ఎలా రెస్పాండ్ అవుతారో ? వైసీపీ శ్రేణులు సుప్రీంను ఆశ్రయిస్తే..ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే ఉత్కంఠ వీడాలంటే..కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
See Also |అందుకే ఎన్నికలు వాయిదా : జగన్ ఆరోపణలపై రమేశ్ కుమార్ కౌంటర్