AP DSC 2025: ఏపీ మెగా డీఎస్సీ 2025.. అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మెరిట్ లిస్ట్ విడుదల.. రేపటి నుంచే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి మెగా డీఎస్సీ 2025 నిర్వహించిన విషయం తెలిసిందే.

AP DSC 2025: ఏపీ మెగా డీఎస్సీ 2025.. అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మెరిట్ లిస్ట్ విడుదల.. రేపటి నుంచే..

Updated On : August 20, 2025 / 11:21 PM IST

AP DSC 2025: డీఎస్సీ 2025 నియామకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెరిట్ లిస్ట్‌ను వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. నేడు ఎంపిక జాబితాను సిద్ధం చేసి, రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు అధికారులు సమాచారం అందించనున్నారు.

అభ్యర్థుల మొబైల్ ఫోన్‌లకు నేరుగా సమాచారం ఇవ్వనున్నారు.

రేపటి నుంచి (ఆగస్టు 21) సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 5 నాటికి పాఠశాలల్లో కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరనున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి మెగా డీఎస్సీ 2025 నిర్వహించిన విషయం తెలిసిందే.

మొత్తంగా 3లక్షల 36వేల 307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 6 నుంచి జులై 2వ తేదీ వరకు 23 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు.

మెగా డీఎస్సీ పరీక్షలకు 92.90శాతం హాజరయ్యారు.

Also Read: డిప్లొమా అర్హతతో ఇస్రోలో జాబ్స్.. నెలకు లక్షపైనే జీతం.. అర్హత, దరఖాస్తు, ఎంపిక విధానం పూర్తి వివరాలు