వార్ వన్ సైడే.. మళ్లీ వైఎస్ జగనే సీఎం: మంత్రి గుడివాడ అమర్నాథ్

గత ఐదేళ్లుగా ప్రతి పేదవాడికి సీఎం అండగా నిలబడ్డారని.. మళ్లీ ఆయనే సీఎం అయితేనే తమకు మంచి జరుగుతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

వార్ వన్ సైడే.. మళ్లీ వైఎస్ జగనే సీఎం: మంత్రి గుడివాడ అమర్నాథ్

AP Minister Gudivada Amarnath Confident YSRCP to win again

Updated On : May 16, 2024 / 12:14 PM IST

Gudivada Amarnath: వార్ వన్ సైడ్ అవుతుంది, వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతారని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు ఓటు వేశారని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లుగా ప్రతి పేదవాడికి సీఎం జగన్ అండగా నిలబడ్డారని.. మళ్లీ ఆయనే సీఎం అయితేనే తమకు మంచి జరుగుతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. విశాఖపట్నంలోనే వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని, రానున్న రోజుల్లో మరింత మెరుగైన పాలన అందిస్తారని విశ్వాసం వ్యకం చేశారు.

”అన్ని ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. ఓటింగ్ పెరిగిన ప్రతి సందర్భంలోనూ దివంగత నేత వైయస్ఆర్, సీఎం జగన్ విజయం సాధించారు. మహాకూటమి జత కట్టిన సమయంలోనూ ఓటింగ్ పెరిగి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. గతంలో కంటే వైఎస్ఆర్సీపీకి ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటింగ్ జరిగింది. అన్ని వర్గాల ప్రజలకు వైసీపీ అండగా నిలబడింది. వార్ వన్ సైడ్ అవుతుంది, వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.

Also Read: పోలింగ్ రోజు కూటమిలో నాల్గో పార్టనర్ చేరాడు.. అయినా వైసీపీదే విజయం : అంబటి రాంబాబు

ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రెస్టేషన్ లో గొడవలకు దిగుతున్నారు. ప్రతిపక్షాలు చేసిన గొడవకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కేంద్రానికి మన ఎంపీల అవసరం పడాలి.కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకూడదు. మా మద్దతు వారికి అవసరమయ్యేలా ఉండాలి. 0.5 పార్టీల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. షర్మిలకు డిపాజిట్ వస్తుందో లేదో చూసుకోమనండి. గత రెండు నెలలుగా కష్టపడి పనిచేసిన వైసీపీ కార్యకర్తలకు, మండుటెండలను సైతం లెక్కచేయకుండా ఓటు వేసిన ప్రజలు ధన్యవాల”ని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.