టచ్ చేసి చూడు అంటూ కొడాలి నానికి దేవినేని ఉమ సవాల్

AP Minister Kodali Nani : మంత్రి కొడాలి నానిపై ఏపీ టీడీపీ నేత దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. నాని వ్యాఖ్యలకు నిరసనగా 2021, జనవరి 18వ తేదీ మంగళవారం ఉమా దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టనున్నారు.
దేవినేని ఉమా ఇంటికెళ్లి బడిత పూజ చేస్తానని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. గొల్లపూడిలో దీక్షకు కూర్చొంటా.. దానికి కౌంటర్‌గా టచ్ చేసి చూడు అంటూ ఉమా సవాల్ విసిరారు. రేపు సీఎం వస్తారో, కొడాలి నాని వస్తారో రండి అన్నారు దేవినేని ఉమా.
దేవినేనిపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత వర్ల రామయ్య ఖండించారు. ఇంట్లోనే దాడి చేస్తాననడం నేరపూరితమని, ఆయనపై కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలపై పాస్టర్ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రవీణ్ చేసిన ప్రకటనలు, వీడియోలు ఏడాదిగా హల్‌చల్ చేస్తున్నాయన్నారు. మొత్తంగా పొలిటికల్ హీట్ నెలకొంది.