మేనిఫెస్టోను వైసీపీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పింది.. చేసింది మాత్రం ఇది..: మంత్రి పార్థసారథి

"గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసింది. కూటమి సర్కారు పాలనలో ఒక్క సంవత్సర కాలంలోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది" అని తెలిపారు.

మేనిఫెస్టోను వైసీపీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పింది.. చేసింది మాత్రం ఇది..: మంత్రి పార్థసారథి

Updated On : June 15, 2025 / 7:18 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 10టీవీ నిర్వహిస్తున్న మెగా ఈవెంట్ షైనింగ్ ఏపీలో మంత్రి పార్థసారథి పాల్గొని మాట్లాడారు. తమ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చామని చెప్పారు.

“గత వైసీపీ ప్రభుత్వం పాలనలో రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన లోపించింది. కేవలం వారి మేనిఫెస్టో, భగవద్గీత, బైబిల్ ఖురాన్ అని చెప్పేసి.. వారి పరిపాలన మొత్తాన్ని ఆ నవరత్నాలకి పరిమితం చేసేశారు. ఆ సంక్షేమ కార్యక్రమాలని పొందుతున్న కుటుంబాల భవిష్యత్తు గురించి, ఆ కుటుంబాలలోని పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఆలోచన లోపించింది.

ఆ ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్ష నాయకుల్ని వేధించి, ప్రతిపక్ష ముఖ్య ముఖ్య నాయకుల్ని కించిపరిచి, ప్రజాస్వామ్యబద్ధంగా చేసే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకుంటూ పోలీసులని ఉపయోగించి, పశ్నించే వాళ్లని నిస్తేజం చేయడానికి ప్రయత్నం చేశారు.

రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన చేశారు. అది కరెక్ట్ కాదని, ప్రజాస్వామ్యంలో దానికి స్థానం కూడా లేదని భావిస్తున్నాను. సూపర్ సిక్స్ లో చెప్పినవి అన్నీ అమలు చేస్తున్నాం. ఉదాహరణకి ఎన్టీఆర్ భరోసా అమలు చేస్తున్నాం. అదే విధంగా తల్లికి వందనం కింద 9000 కోట్ల రూపాయలను సుమారు దాదాపు 62 లక్షల మంది విద్యార్థులు విద్యార్థులకి పంపిణీ చేశాం.

దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తున్నాం. పేదవాళ్ల కడుపు నింపి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను ప్రారంభించి కొన్ని లక్షల మందికి మరి వివిధ ప్రాంతాల్లో 223 క్యాంటీ అన్న క్యాంటీన్ల పరిధిలో భోజన సదుపాయం ఏర్పాటు చేశాం.

గృహ నిర్మాణంలో పీఎంఏవై కింద దాదాపు 18 లక్షల ఇళ్లు శాంక్షన్ చేస్తున్నాం. వైసీసీ హయాంలో ఐదు సంవత్సరాల్లో ఆరున్నర లక్షల ఇళ్లు పూర్తి చేస్తే, మిగిలిన ఇళ్లను పూర్తి చేయటానికి తీవ్రంగా కృషి చేస్తున్నాం.

గత ప్రభుత్వ విధానాల మూలంగా, పేదవాళ్లకి నష్టం జరగడం మూలంగా ఈ గృహ నిర్మాణం కొంత ఆలస్యం అయితే.. ముఖ్యమంత్రిని ఒప్పించి ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి అదనపు ఆర్థిక సహాయం చేయించాం. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసింది. కూటమి సర్కారు పాలనలో ఒక్క సంవత్సర కాలంలోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది” అని తెలిపారు.