టీడీపీ కనుసన్నల్లో కరోనా స్లీపర్ సెల్స్: మంత్రి మోపీదేవి
కరోనాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. రోజురోజుకు కరోనా విస్తరిస్తుంది. ఇప్పటికే వెయ్యికి పైగా కేసులు రాష్ట్రంలో నమోదు కాగా.. రాజ్‌భవన్‌లో నలుగురు సిబ్బందికి పాజిటివ్ వచ్చిందనే వార్తలతో వైసీపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయ్యింది.

ఈ క్రమంలోనే టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై మంత్రి మోపిదేవి వెంకటరరమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషనర్ కనగరాజ్ ప్రమాణ స్వీకారాన్ని టీడీపీ రాజకీయం చేస్తోందంటూ.. టీడీపీది చిల్లర రాజకీయం అంటూ మండిపడ్డారు. జగన్ పాలన, ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారతారని అన్నారు మంత్రి మోపీదేవి.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో కొందరు కరోనాను వ్యాప్తి చేయడానికి స్లీపర్ సెల్స్‌లా తయారయ్యారని, టీడీపీ నేతలు, కార్యకర్తల కనుసన్నల్లో కొంతమంది కరోనా స్లీపర్ సెల్స్‌ను గ్రామాల్లో ప్రవేశపెట్టారనే అనుమానం వస్తోందని అన్నారు మోపీదేవి. ఏ విధమైన ఇబ్బందులు లేని ప్రాంతాల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయంటే దీని వెనుక టీడీపీ కుట్ర ఉందని అన్నారు.