షిప్‌ను సీజ్ చేశాం.. సీజ్ చేసే చట్టాలు ఉన్నాయి: మంత్రి నాదెండ్ల మనోహర్
అంతర్జాతీయ షిప్ అయినా కొన్ని సందర్భాల్లో అధికారం ఉంటుందని నాదెండ్ల మనోహర్ అన్నారు.

minister nadendla manohar
గత ఐదేళ్లు కాకినాడ పోర్టులోకి ఎవరినీ అనుమతించలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పోర్టులో ఏమి జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి అని చెప్పారు. కాకినాడ పోర్టు ప్రక్షాళన జరుపుతామని, షిప్‌ను సీజ్ చేశామని చెప్పారు.
సీజ్ చేసే చట్టాలు ఉన్నాయని, అంతర్జాతీయ షిప్ అయినా కొన్ని సందర్భాల్లో అధికారం ఉంటుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రస్తుతం ఉన్న అధికారుల ప్రమేయం ఉందని, అందరిపైనా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. రేషన్ బియ్యం డోర్ డెలివరీ పేరుతో వైసీపీ ప్రభుత్వం బియ్యం మాఫియా చేసిందని అన్నారు.
డోర్ డెలివరీ వ్యాన్లతో ప్రజల దగ్గర 10 రూపాయిలకు కొనుగోలు చేసి బియ్యాన్ని సేకరించారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి కాకినాడకు రేషన్ బియ్యాన్ని తరలించారని వివరించారు. కాకినాడ సీ పోర్టుకి అరబిందో ఎలా ప్రవేశించిందని అడిగారు. పోర్టుని పూర్తిగా స్వాధీనం చేసుకోడానికి వైఎస్ జగన్ ప్రయత్నాలు చేశారని అన్నారు.
గంజాయి స్మగ్లింగ్, ఉగ్రవాదుల ముప్పు ఉండదని మీరు చెప్పగలరా అని ప్రశ్నించారు. అంత పెద్ద పోర్టుకి 20 మంది భద్రత పెట్టారని, దీని వెనుక ఉద్దేశం ఏంటని నిలదీశారు. కాకినాడను స్మగ్లింగ్ కేంద్రంగా మార్చేశారని, మంచి నగరానికి చెడ్డపేరు తీసుకునివచ్చారని తెలిపారు.
మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి స్టాకింగ్ పాయింట్స్ లో తనిఖీలు చేస్తున్నానని చెప్పారు. జూన్ 28 తేదీన 13 గోడౌన్స్ సీజ్ చేశామని, 51 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశామని తెలిపారు. 13 కంపెనీలు కోర్టుకి వెళ్తే.. కోర్టు ఆదేశాల ప్రకారం విడుదల చేశామని చెప్పారు.
కేటీఆర్, హరీశ్ రావుకు నిద్ర పట్టలేదు.. అందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు: జూపల్లి కృష్ణారావు