Roja Selvamani : దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీనే జగన్‌ను ఏమీ చేయలేకపోయారు- పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్

నువ్వు ఆటలో అరటి పండు. నువ్వేం చేస్తావ్? అని మేము అడుగుతున్నాం. Roja Selvamani - Pawan Kalyan

Roja Selvamani : దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీనే జగన్‌ను ఏమీ చేయలేకపోయారు- పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్

Roja Selvamani - Pawan Kalyan (Photo : Twitter)

Updated On : August 11, 2023 / 5:42 PM IST

Roja Selvamani – Pawan Kalyan : సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఆటలో అరటిపండు అంటూ మండిపడ్డారు. కేంద్రమంత్రి అమిత్ షాకు చెప్పి జగన్ ను ఆటాడిస్తానంటున్న పవన్.. బ్రో సినిమాను 4 ఆటలు కూడా ఆడించుకోలేకపోయారని విమర్శించారు. సోనియా గాంధీనే జగన్ ను ఏమీ చేయలేకపోయారని చెప్పారు. చంద్రబాబు చెప్పినట్లు చేయడం తప్ప పవన్ కల్యాణ్ కు ఏమీ తెలీదన్నారు రోజా.

Also Read..Butchaiah Chowdary: జనసేనతో పొత్తు కుదిరితే బుచ్చయ్యచౌదరి త్యాగం చేస్తారా?

”అమిత్ షాకి చెప్పి జగన్ ను ఒక ఆట ఆడిస్తాడట. నీ సినిమా బ్రోనే నాలుగు ఆటలు ఆడించుకోలేక చతికలపడ్డావ్. నువ్వు జగన్ మోహన్ రెడ్డిని ఆడించడం ఏంటి? జగన్ మోహన్ రెడ్డిని ఆడించాలన్న, ఓడించాలన్నా ఈ దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే కాలేదు. నువ్వు ఆటలో అరటి పండు. నువ్వేం చేస్తావ్? అని మేము అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఆటలో నువ్వొక అరటిపండులా ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు రాసిచ్చిన అబద్దాలు, పచ్చ ఛానళ్లు ఇచ్చే రాతలు మాట్లాడుతున్నావు తప్ప మరొకటి లేదు” అని పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు మంత్రి రోజా.

Also Read..Butchaiah Chowdary: జనసేనతో పొత్తు కుదిరితే బుచ్చయ్యచౌదరి త్యాగం చేస్తారా?

మూడో విడత వారాహి యాత్రలో భాగంగా విశాఖలో జగదాంబ సెంటర్ లో బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. సీఎంపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కారణం జగనే అని అన్నారు. దానికి కారణాలను ఆయన విశ్లేషించారు. ”జగన్, వాళ్ల గుంపు తెలంగాణలో భూములు దోచుకుంది. అందుకే అక్కడ తన్ని తరిమేశారు. ఆంధ్రకి పొమ్మన్నారు. ఇక్కడ రుషికొండ, ఎర్రమట్టి దిబ్బలు, సహజవనరులు కూడా దోచుకుంటున్నారు” అని ఫైర్ అయ్యారు పవన్ కల్యాణ్. అంతేకాదు.. కేంద్రంతో చెప్పి నిన్ను ఓ ఆట ఆడిస్తా చూడు అంటూ జగన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.