Roja Selvamani : హైదరాబాద్‌లో మీ ఇళ్లు కొండపైనే ఉన్నాయని మరిచిపోయారా? జగన్ ఇళ్ల గురించి నీకెందుకు?- పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించిన మంత్రి రోజా

పెద్ద మనిషిగా ఉన్న చిరంజీవికి సడెన్ గా ఏమైందో. అమిత్ షాకు అలిపిరి వద్ద జరిగిన దాడి గుర్తుంది. Roja Selvamani - Pawan Kalyan

Roja Selvamani : హైదరాబాద్‌లో మీ ఇళ్లు కొండపైనే ఉన్నాయని మరిచిపోయారా? జగన్ ఇళ్ల గురించి నీకెందుకు?- పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించిన మంత్రి రోజా

Roja Selvamani - Pawan Kalyan

Updated On : August 12, 2023 / 5:37 PM IST

Roja Selvamani – Pawan Kalyan : ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు. విశాఖలోని రుషికొండపై జరుగుతున్న నిర్మాణాల విషయంలో పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా.. విశాఖ ప్రజలను అవమానపరిచే విధంగా పవన్ మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు.

”రుషికొండను బోడికొండ అని బోడి వెధవలు ప్రచారం చేస్తున్నారు. రుషికొండలో ఏం అక్రమాలు జరుగుతున్నాయో పవన్ చెప్పాలి. దీనిపై మీరు కోర్టుకు వెళ్లారు. అయినా ఎక్కడా వ్యతిరేకంగా స్టే ఇవ్వలేదు. అక్కడ జరిగే ప్రతిదీ కోర్టుకు చెబుతున్నాము. నా కాలు మీద నా కాలు వేసుకుంటే నీకేం బాధ అన్నట్లు ఇందులో తనకున్న ఇబ్బంది ఏంటో పవన్ చెప్పాలి.

Also Read..Galla Family: గల్లా కుటుంబం తరుఫున ఎవరు పోటీ చేసినా ఓకే.. టిక్కెట్ ఇచ్చేందుకు రెడీ!

రుషికొండపైనే రామానాయుడు స్టూడియోతో పాటు ఇంకా అనేక కట్టడాలు ఉన్నాయి. పవన్ కి ఇవి కనిపించడం లేదా? హైదరాబాద్ లో మీ ఇళ్లు కొండపైనే ఉన్నాయని మరచిపోయారు. కొండలపై కట్టడాలు కట్టకూడదని అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. రుషికొండ ఎదురుగా ఉన్న బాలకృష్ణ అల్లుడికి చెందిన గీతం యూనివర్సిటీలో భూకబ్జాల గురించి ఎందుకు మాట్లడవు?

19వేల చదరపు మీటర్ల పరిధిలో నిర్మాణాలకు మాకు అనుమతులు ఉన్నాయి. అన్ని అనుమతులు తీసుకున్నాకే ఈ కట్టడాలు చేపట్టాం. భవిష్యత్తులో కోర్టు మాటలకు కట్టుబడి ఉంటాము. జగన్ ఇళ్ల గురించి మాట్లాడడానికి నువ్వు ఎవడ్రా? జనసైనికులకు జగన్ సైనికులుగా మేము అవకాశం ఇవ్వబోము.

పెద్ద మనిషిగా ఉన్న చిరంజీవికి సడెన్ గా ఏమైందో. కనీసం వీరికి ఏపీలో ఇల్లు కూడా లేదు. ఇప్పటివరకు చంద్రబాబుకి చెప్పాడు. ఇక అమిత్ షా కు చెబుతాడట. అమిత్ షాకు అలిపిరి వద్ద జరిగిన దాడి గుర్తుంది. ఆటలో అరటిపండు లాంటి వ్యక్తి పవన్ కల్యాణ్. రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ గురించి చాలా మాటలు చెప్పింది. వైజాగ్ లో రాజధాని రాకూడదని ఇదంతా చేస్తున్నారు.

Also Read..Bonda Uma : వైసీపీ 175కి 175 సీట్లు గెలిస్తే మా పార్టీని మూసేస్తాం : బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు

విధుల నుంచి తీసేసిన వాలంటీర్.. హత్య చేస్తే దానిపై అనవసర రాద్దాంతం చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థపై బురద జల్లుతున్నారు” అని పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి రోజా.