AP MLC Elections 2023: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆరుగురి గెలుపు

మొదట వైసీపీ అభ్యర్థి జయమంగళ వెంకట రమణ అనూహ్యంగా ఓటమి పాలయ్యారని ప్రచారం జరిగింది. అయితే, ఆయన గెలిచారని అధికారులు ప్రకటించారు. అలాగే, మర్రి రాజశేఖర్, సూర్యనారాయణ రాజు, బొమ్మి ఇజ్రాయిల్, పోతుల సునీత, యేసు రత్నం గెలుపొందారు.

AP MLC Elections 2023: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆరుగురి గెలుపు

AP MLC elections

Updated On : March 23, 2023 / 8:35 PM IST

AP MLC Election 2023: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆరుగురు గెలుపొందారు. మొదట వైసీపీ అభ్యర్థి జయమంగళ వెంకట రమణ అనూహ్యంగా ఓటమి పాలయ్యారని ప్రచారం జరిగింది. అయితే, ఆయన గెలిచారని అధికారులు ప్రకటించారు. అలాగే, మర్రి రాజశేఖర్, సూర్యనారాయణ రాజు, బొమ్మి ఇజ్రాయిల్, పోతుల సునీత, యేసు రత్నం గెలుపొందారు.

వీరందరూ మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. కోలా గురువులు ఓడిపోయారు. టీడీపీ నుంచి పంచుమర్తి అనురాధ గెలుపొందిన విషయం తెలిసిందే. తమ ఎమ్మెల్యేలను ఇబ్బందులకు గురిచేసినప్పటికీ తాము గెలిచామని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని అన్నారు.

ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీగా గెలుపొందిన కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ నెల రోజుల క్రితమే టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఏపీ సీఎం జగన్ సమక్షంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీలో చేరారు. కాగా, జయమంగళ వెంకట రమణ రాజకీయ జీవితం టీడీపీతో ప్రారంభమైంది. 1999లో టీడీపీలో చేరిన ఆయన… 2005లో కైకలూరు జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత, 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి కైకలూరు నుంచి గెలిచారు. 2014లో ఆయనకు టికెట్ రాలేదు. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడిపై ఆయన పలు ఆరోపణలు చేశారు.

AP MLC Elections-2023: టీడీపీ ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ గెలుపు