AP Politics : ఎమ్మెల్యే వేగుళ్ల వర్సెస్ ఎమ్మెల్సీ తోట మధ్య మాటల తూటాలు..

కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అఖిల పక్ష ర్యాలీలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను ఉద్ధేశించి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర రావు ఎమ్మెల్సీ ‘గాడిద’లు కాస్తున్నారా? అంటూ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ తోట స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

AP Politics : ఎమ్మెల్యే వేగుళ్ల వర్సెస్ ఎమ్మెల్సీ తోట మధ్య  మాటల తూటాలు..

Mlc Thota Trimurthulu Vs Mla Vegulla Jogeswara Rao

Updated On : June 14, 2022 / 4:54 PM IST

MLC Thota trimurthulu Vs MLA vegulla jogeswara rao : కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సోమవారం (13,2022) అఖిల పక్ష ర్యాలీలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను ఉద్ధేశించి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర రావు ‘గాడిద’ అంటూ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ తోట స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

దీంట్లో భాగంగా మంగళవారం ఏకంగా ఎమ్మెల్యే సభావేదికపై ఉండగానే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేని నేరుగానే ‘గాడిద’కు స్వాగతం అని అనేశారు. దీంతో స్టేజీపైన ఉన్న ఎమ్మెల్యే ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆయన కాసేపటికి కోలుకుని ఏదో మాట్లాడబోతుండగా మధ్యలోనే కల్పించుకున్న తోట ఏం చెప్పక్కర్లేదు అంటూ ప్రభుత్వం పాలసీలపై విమర్శలు చేయండి అంతేకానీ వ్యక్తిగతంలో ఇటువంటి మాటలు మాట్లాడొద్దు అంటూ సూచించారు.

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మండపేట నియోజవర్గం ఏర్పడింది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 2019 వరకూ తెలుగుదేశం పార్టీయే అక్కడ జయకేతనం ఎగురవేసింది. కమ్మ సామాజికవర్గానికి చెందిన వేగుళ్ల జోగేశ్వరరావు ఇక్కడ నుంచి హాట్రిక్‌ విజయం సాధించారు. కాపులు, శెట్టిబలిజల జనాభా ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వేగుళ్ల తన పట్టును నిలుపుకోవడం విశేషం. గత ఎన్నికల్లో శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ వైసీపీ తరఫున బరిలో నిలుచున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా మండపేట టీడీపీ కంచుకోట అని వేగుళ్ల తన విజయంతో చాటారు.