AP Covid Update : ఏపీలో కొత్తగా 264 కోవిడ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 264 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

Ap Covid Up Date
AP Covid Update : ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 264 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. కోవిడ్ నుంచి 247 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2 వేల 175 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
Also Read : heart attacked by Chickens : డీజే సౌండ్‌కు కోడికి గుండెపోటు…63 కోళ్లు కన్నుమూత
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షల 71వేల 831 కి చేరింది. వీరిలో 20 లక్షల 55 వేల 226 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. అదే సమయంలో కృష్ణాజిల్లాలో ఒకరు కోవిడ్ వల్ల మరణించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14 వేల 430 కు చేరింది. నిన్నటివరకు రాష్ట్రంలో 3 కోట్ల 2లక్షల 55 వేల 667 మంది శాంపిల్స్ పరీక్షించటం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.