AP Covid Report : ఏపీలో కొత్తగా 127 కోవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 127 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

AP Covid Report : ఏపీలో కొత్తగా 127 కోవిడ్ కేసులు

AP Covid Report

Updated On : December 17, 2021 / 6:03 PM IST

AP Covid Report :  ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 127 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 180 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,758 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,75,546 కి చేరింది. వీరిలో 20,59,311 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఏపీలో గత 24 గంటల్లో ముగ్గురు మరణించారు. వీరు పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, జిల్లాలకు చెందిన వారు.
Also Read : Tiruppavai : తిరుమ‌ల‌ శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్ స్వామి మ‌ఠంలో తిరుప్పావై
ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14 వేల 477కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి వారు పనులు చేస్తున్నచోటకే వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నారు.