AP Corona Cases : ఏపీలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కొత్త కేసులు

ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి. నిన్నటితో (984) పోలిస్తే దాదాపుగా డబుల్ అయ్యాయి.

AP Corona Cases : ఏపీలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కొత్త కేసులు

Ap Corona Cases

Updated On : January 11, 2022 / 6:56 PM IST

AP Corona Cases : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి. నిన్నటితో (984) పోలిస్తే దాదాపుగా డబుల్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 36వేల 452 శాంపుల్స్ పరీక్షించగా.. కొత్తగా 1,831 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. కాగా, కరోనాతో ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఇది రిలీఫ్ ఇచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో కొవిడ్‌ బారి నుంచి 242 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,195 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Bad Breath : నోటి నుండి దుర్వాసన వస్తుందా…ఎందుకో తెలుసా?

జిల్లాల వారిగా కరోనా కేసుల వివరాలు..
కొత్తగా నమోదైన కేసుల్లో.. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 467 కేసులు వెలుగుచూశాయి. విశాఖ జిల్లాలో 295, కృష్ణా జిల్లాలో 190, గుంటూరు జిల్లాలో 164, అనంతపురం జిల్లాలో 161, తూర్పు గోదావరిలో 84, కడప జిల్లాలో 20, నెల్లూరులో 129, శ్రీకాకుళం జిల్లాలో 122, విజయనగరంలో 40, పశ్చిమగోదావరిలో 57, ప్రకాశం జిల్లాలో 46, కర్నూలు జిల్లాలో 56 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.

Turmeric : పసుపు తీసుకునే విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే?

కొన్ని రోజులుగా ఐదారు జిల్లాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో వ్యవధిలో భారీగా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. కాగా కరోనా, ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మహమ్మారి కట్టడికి చర్యలు చేపట్టింది.

పండగ తర్వాత నైట్ కర్ఫ్యూ..
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అయితే, ఈ కర్ఫ్యూ అమలు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండగ తర్వాత నుంచి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పండగ తర్వాత అంటే 18వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.