AP Corona News : ఏపీలో కొత్తగా 30 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10వేల 529 కరోనా పరీక్షలు నిర్వహించగా, 30మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(AP Corona News)

AP Corona News : ఏపీలో కొత్తగా 30 కరోనా కేసులు

Ap Corona

Updated On : March 22, 2022 / 7:52 PM IST

AP Corona News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10వేల 529 కరోనా పరీక్షలు నిర్వహించగా, 30మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా విశాఖపట్నంలో 7 కేసులు వచ్చాయి. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదు. మరో 51మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 23,19,297 కరోనా కేసులు నమోదవగా.. 23,04,082 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో ఇంకా 485 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో నేటివరకు కోవిడ్ తో 14వేల 730 మంది మరణించారు. నేటివరకు రాష్ట్రంలో 3,33,50,309 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 7వేల 364 కరోనా పరీక్షలు నిర్వహించగా, 37మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(AP Corona News)

అటు దేశంలో కరోనా వైరస్ కట్టడిలో ఉంది. రెండేళ్ల కనిష్ఠానికి తగ్గిపోతోంది. కొన్నిరోజులుగా కొత్త కేసులు రెండు వేలకు దిగువనే నమోదవుతున్నాయి. క్రితం రోజులాగే తాజాగా 1,500 కొత్త కేసులు, 30కి పైగా మరణాలు సంభవించాయి.(AP Corona News)

Booster Dose: బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఫోకస్

సోమవారం 5.68 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,581 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల వ్యవధిలో మరో 33 మంది కోవిడ్ తో మరణించారు. వైరస్ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 23వేల 913కి తగ్గిపోయాయి. నిన్న 2,741 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల రేటు 0.06 శాతానికి తగ్గిపోగా.. రికవరీ రేటు 98.74 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకూ 4.30 కోట్ల మందికి కరోనా సోకగా.. 4.24 కోట్ల మంది కోలుకున్నారు. నేటివరకు దేశంలో 5.16 లక్షల మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.(AP Corona News)

ఇక దేశంలో టీకా కార్యక్రమం దశలవారీగా ముందుకు సాగుతోంది. నిన్న 30,58,879 మంది టీకా తీసుకున్నారు. ఇప్పటి వరకూ 181 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి కోరలు చాస్తుండటంతో.. దేశంలో 18 ఏళ్లు పైడినవారందరికీ బూస్టర్ డోసు ఇచ్చే విషయమై కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెల్త్‌ కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు సహా 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఈ ప్రికాషనరీ డోస్ ఇస్తున్నారు.

China Covid-19 Deaths : చైనాలో కరోనా విలయం.. రెండేళ్ల తర్వాత మొదలైన కరోనా మరణాలు..!

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మళ్లీ కొవిడ్‌ కేసులు పెరుగుతుండడం, అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారికి మూడో డోసు నిబంధన అడ్డంకిగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, మూడో డోసు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు? సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా ఉచితంగానే ఇస్తారా? లేదా ప్రైవేట్ లో డబ్బులు చెల్లించి వేసుకోవాలా? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

దేశంలో గతేడాది(2021) జనవరి 16న కొవిడ్‌ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత ఆరోగ్య కార్యకర్తలు, ఆ తర్వాత ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా వేయడం ప్రారంభించారు. మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి కో-మార్బిడిటీ ఉన్న వాళ్లకు తొలుత ప్రాధాన్యం ఇచ్చారు. ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా తీసుకునే అవకాశం కల్పించారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది(2022) జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వయసు వారికి, మార్చి 16 నుంచి 12-14 ఏళ్ల వయసు వారికీ టీకా తీసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది.