ఆకస్మిక సెలవులో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ..ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఆయన హయాంలో లేనట్లే!
ఏపీలో పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను సమర్థమంతంగా నిర్వహించిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హయాంలో.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగవని తెలుస్తోంది. ఎస్‌ఈసీ రమేష్‌కుమార్ ఆకస్మికంగా సెలవు పెట్టారు.

SEC nimmagadda on leave : ఏపీలో పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను సమర్థమంతంగా నిర్వహించిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హయాంలో.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగవని తెలుస్తోంది. ఎస్‌ఈసీ రమేష్‌కుమార్ ఆకస్మికంగా సెలవు పెట్టారు. ఈ నెల 17 నుంచి 24 వరకు ఆయన సెలవులో ఉండనున్నారు. ఆ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించనున్నారు.
ఈ నెల 31తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పదవీకాలం ముగిసింది. ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధపడతారని ఓ వాదన వినిపించింది. అయితే వచ్చేవారం సెలవు పెట్టడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేదిశగా అడుగులు వేయట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిమ్మగడ్డ హయాంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.