Speaker Ayyanna Patrudu: దొంగల్లా వచ్చిపోతున్నారు.. ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. కొందరు ఎమ్మెల్యేలు ..

Speaker Ayyanna Patrudu: దొంగల్లా వచ్చిపోతున్నారు.. ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్

Speaker Ayyanna Patrudu

Updated On : March 20, 2025 / 12:45 PM IST

Speaker Ayyanna Patrudu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు దొంగల్లా వచ్చిపోతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ సమావేశాల్లో 25 ప్రశ్నలకు సభలో సమాధానాలు లభించలేదు. ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నలు వేసి రావడం లేదు. దానివల్ల మరికొంత మంది సభ్యులు ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారని అన్నారు.

Also Read: YSRCP: జగన్‌కు మర్రి ఝలక్‌.. ఎమ్మెల్సీలు ఎందుకిలా? వీళ్ల బాటలో మరికొందరు?

ప్రశ్నలు వేసిన సభ్యులు సభకు రావాలి. మరికొందరు సభ్యులు దొంగల్లా వచ్చి హాజరుపట్టికలో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారు. అది వారి గౌరవాన్ని తగ్గించుకోవడమే అవుతుందని స్పీకర్ అన్నారు. వై. బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, మాత్స్య లింగం, విరూపాక్ష, విశ్వేశ్వరరావు, ఆకేపాటి అమర్ నాథ్, దాసరి సుధలు వేర్వేరు తేదీల్లో సంతకాలు పెట్టినట్లు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటుగా సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏమిటి అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. వాళ్లు సభకు వచ్చినట్లు నాకు కనపడలేదు. ఎంత వరకు సమంజసం..? ఓట్లేసిన ప్రజలకు తలవంపులు తెచ్చారని నా అభిప్రాయం అంటూ స్పీకర్ అన్నారు.