AP SSC Supplementary Results: ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను(AP SSC Supplementary Results) రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ విడుదల చేశారు. విజయవాడలో పలువురు అధికారులతో కలిసి ఆయన ఈ ఫలితాలు విడుదల చేసి మాట్లాడారు. జూలై 6 నుంచి 15 వరకు పదో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 1,91,600 మంది హాజరయ్యారు.

AP Inter Results
AP SSC Supplementary Results: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ విడుదల చేశారు. విజయవాడలో పలువురు అధికారులతో కలిసి ఆయన ఈ ఫలితాలు విడుదల చేసి మాట్లాడారు. జూలై 6 నుంచి 15 వరకు పదో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 1,91,600 మంది హాజరయ్యారు. సఫ్లిమెంటరీ రాసినవారికి గ్రేడ్లు కూడా ఇస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పదో తరగతి పరీక్షల్లో మొత్తం 2,01,627 మంది ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఉత్తీర్ణత శాతం కేవలం 67.26 శాతంగానే నమోదుకావడంతో సప్లిమెంటరీ పరీక్ష ఫీజుకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఫలితాలను resultsbse.ap.gov.inలో చూసుకోవచ్చు. రోల్‌నంబరు ఎంటర్ చేస్తే ఫలితాలు కనపడతాయి.