AP SSC Result: ఏపీ టెన్త్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డేట్ ఖరారు..

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమైంది. ఫలితాలను ఈనెల..

AP SSC Result: ఏపీ టెన్త్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డేట్ ఖరారు..

AP 10th Results 2025

Updated On : April 19, 2025 / 10:28 AM IST

AP SSC Result 2025: ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఏపీలో ఇంటర్ ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. దీంతో ఫలితాలకోసం పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫలితాల విడుదలపై విద్యాశాఖ అధికారులు కీలక అప్ డేట్ ఇచ్చారు.

Also Read: Nara Lokesh : బెట్టింగ్ యాప్స్ పై యూట్యూబర్ పోస్ట్.. మంత్రి లోకేశ్ సీరియస్ వార్నింగ్..

ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు సజావుగా జరిగాయి. పబ్లిక్ పరీక్షలకు 6,19,275 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి 5,64,064 మంది, తెలుగు మీడియాంకు సంబంధించి 51,069 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు పూర్తయిన వెంటనే ఆలస్యం చేయకుండా అధికారులు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు. జవాబు పత్రాల వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తికావడంతో ఫలితాల వెల్లడికి ఏపీ పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది.

 

ఈనెల 23వ తేదీన పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధంచేశారు. ఫలితాలను https://www.bse.ap.gov.in  వెబ్ సైట్ లోనూ.. మన మిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

వాట్సాప్ లో ఏపీ టెన్త్ ఫలితాలు ఇలా..
◊ ఈసారి ఏపీలోని టెన్త్ విద్యార్థులు మన మిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు.
◊ ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు ‘Hi’ అని మెసేజ్ చేయాలి.
◊ ఆ తర్వాత ‘సెలెక్ట్ సర్వీస్’ లో ‘విద్యా సేవలు’ ఎంచుకోవాలి.
◊ ‘డౌన్లోడ్ ఏపీ SSC ఫలితాలు- 2025’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
◊ మార్కుల మెమో పొందడానికి మీ ‘హాల్ టికెట్’ నెంబర్‌ను నమోదు చేయాలి.
◊ పీడీఎఫ్ రూపంలో రిజల్ట్స్ కనిపిస్తాయి.